మదనాపురం, డిసెంబర్ 19 : నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. శుక్రవారం దంతనూరు శివారులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మండలంలో ఏడు గ్రామ పంచాయతీల సర్పంచులను, వివిధ గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఆయన శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అదోగతి పాలయిందని ఎద్దేవా చేశారు. మార్పు మొదలైంది కాబట్టే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎవరూ కూడా అధైర్య పడవద్దన్నారు.
రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అధిక స్థానాలలో గెలుపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ మాజీ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, యూత్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ మాజీ సభ్యుడు వెంకటేశ్‌యాదవ్, గ్రామాధ్యక్షుడు బాలకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భూత్పూర్, డిసెంబర్ 19 : దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నా యకులు వెంకటన్న, సోహెబ్, రహమాన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు వలియోద్దీన్, కొత్తగా గెలిచిన వార్డు సభ్యులు 2వ వార్డు సభ్యుడు అలివేలు రాము లు, 3వ వార్డు సభ్యుడు శారదా కురుమూర్తి, 4వ వార్డు సభ్యుడు పారిజాత నాగరాజు, 8వ వార్డు స భ్యుడు మహేందర్, 10వ వార్డు సభ్యుడు గోవర్ధన్‌తోపాటు 100మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గులాబీ ఖండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము పాల్గొన్నారు.