మక్తల్, ఏప్రిల్ 07 : పేదల పెళ్లిళ్లకు, పుస్తెమట్టెలు, బట్టలు, బియ్యం తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నామని, పేద విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థికసాయం సైతం అందిస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. కొత్త సూగయ్య- రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 27వ వార్షిక అంబలి కేంద్రాన్ని మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 26 సంవత్సరాల నుంచి అంబలి కేంద్రాన్ని కొత్త సూగయ్య- రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.
వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త సూర్యనారాయణగుప్తా 5 లక్షల రూపాయల చెక్కును విగ్రహాల కోసం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ గుప్తా, కొత్త జగదీశ్ గుప్తా, కొత్త నర్సిములు గుప్తా, డాక్టర్ కిరణ్, నేతలు లక్ష్మారెడ్డి, బి.చంద్రకాంత్ గౌడ్, బి కొండయ్య, రాజుల ఆశిరెడ్డి , గణేష్, కట్టా సురేశ్ గుప్తా, కోళ్ల వెంకటేశ్, దేవరింటి నరసింహారెడ్డి, గోలపల్లి నారాయణ, చిన్న హనుమంతు, బి. నర్సింలు, అన్వర్, మనన్, కావలి ఆంజనేయులు, వల్లంపల్లి లక్ష్మణ్, నీలప్ప, రహీం పటేల్, పి.రంజిత్ రెడ్డి ,శుభోదయ రాములు, మందుల నరేందర్, రవికుమార్, అమర్, కల్లూరి గోవర్దన్, చందాపూర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.