మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మూసాపేట, నవంబర్ 20 : ‘ఆరు గ్యారెంటీలు వచ్చేదాకా పోరాడుతాం.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలేదే లేదు’.. అని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బు ధవారం మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంట మండలంలోని కురుమూర్తి స్వామిని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అంతకుముందు భూ త్పూర్, మూసాపేట, అడ్డాకుల, కొత్తకోట, మదనాపురం మండలాల్లో హరీశ్‌రావుకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు.
అనంతరం కురుమూర్తి ఆలయానికి మెట్లు ఎక్కి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అమ్మాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ సీ ఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్ని తిట్లు అ యినా మేము భరిస్తాం.. కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊ రుకోమని హెచ్చరించారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500, రైతు భరోసా రూ.15 వేలు, విద్యార్థులకు వి ద్యా భరోసా కార్డు, ఇందిరమ్మ ఇండ్లు.. ఇలా ఇస్తానన్న ఏ ఒక్కటీ ఇవ్వకుండా మోసం చేశాడని ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ పే రుతో ఇండ్లను కూలగొట్టడం తప్పా.. ఇండ్లు కట్టడం రేవంత్‌కు తెలియదంటూ ఎద్దేవా చేశారు. అందుకే నువ్వు ఎనుముల రేవంత్‌రెడ్డివి కాదు.. ఎగవేతల రేవంత్‌వి అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకం.. ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేసి భూసేకరణ కాకుండా అడ్డుకున్నది నాటి కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ కృషి చేశారు. పనులు దాదాపు చివరి దశలో ఉన్నా.. నిధుల కేటాయింపులో ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఇప్పటికైనా పనులు పూర్తి చేసి ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న కాలంలో పనులు పూర్తి చేసి ఉంటే ఈసారి శ్రీశైలం డ్యాం నుంచి సముద్రానికి నీళ్లు వృథాగా వెళ్లే పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో మల్లయ్య అనే రైతుతో హరీశ్‌రావు మాట్లాడారు. సన్న వడ్లు కొనుగోలు కేంద్రానికి తెచ్చి25 రోజులు ఎదురుచూసి బయట తక్కువ రేటుకి అమ్ముకున్నానని సదరు రైతు తెలిపాడు. ప్రభుత్వం కొర్రీలు పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే సన్నవడ్లను బయట అమ్మినట్లు మహిళా రైతు శాంతమ్మ వాపోయింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రానికి వడ్లు తెస్తే ఇప్పటివరకు కొనలేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశా రు.
నెల కిందట ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని కొంటామని ప్రకటించారని, నిన్న సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రకటించారు.. నెల రోజుల్లో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నులు దళారుల పాలైందని వారు చెప్పకనే చెప్పారన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వలేదు.. రుణమాఫీ చేయలేదు.. అయినా సరే ధాన్యమైనా కొం టారనుకుంటే కనీసం అవి కొనుగోలు చేసే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో చివరి గింజ వర కూ ప్రభుత్వం కొనుగోలు చేసిందనీ గుర్తు చేశారు. పత్తి రైతుల నుం చి 25 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు.. నిన్నటి వర కు కొన్నది కేవలం లక్షా 30 మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే అన్నా రు. రూ.7,520 మద్దతు ధర రావాల్సిన తెల్లబంగారానికి రూ.5 వేలకే అమ్ముకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వంద రోజు ల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి 350 రోజు లు కావస్తున్నా వాటి ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలన్నీ అమలు చేయాలని, మంచి పరిపాలనను అందించాలని కురుమూర్తి స్వామిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్, మాజీ చైర్మన్లు ఇంతియాజ్ ఇసాక్, పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, బస్వరాజ్‌గౌడ్, రాజేశ్వరి, రాము ఉన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా మహిళలకు రూ.3 వేలు ఇస్తామని తప్పుడు హామీ ఇచ్చారని ధ్వజమెత్తా రు. వరంగల్ మీటింగ్‌లో తిట్ల పురాణం తప్పా ప్రజలు, మ హిళలకు పనికొచ్చే ఒక్క మాట కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు పెట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు వైద్య విద్యను అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పా లమూరు జిల్లాలో ప్రతి ఇంటికీ కృష్ణా జలాలను మిషన్ భగీరథ ద్వారా అందించింది కేసీఆర్ అని అన్నారు.
50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, పదహారేండ్లు టీడీపీ ఉమ్మడి రా ష్ర్టాన్ని పాలించినా.. ఈ జిల్లాకు తాగు, సాగునీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెండింగ్ ప్రా జెక్టులను రూ.4 వేల కోట్లు ఖర్చుపెట్టి రన్నింగ్‌గా మార్చి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించామన్నారు. కల్వకుర్తి పం ప్ హౌస్ వద్ద నిద్ర చేసి మరీ పనులు చేయించామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పాలమూరును వలసల జిల్లాగా మారిస్తే.. వలసలను వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్‌దే అన్నారు.
ఈరోజు పంటలు పండితే ఆ గొప్పతనం మాదని సిగ్గులేకుండా చెప్పుకోవడం కాదు.. పంటలు పండడానికి కృషి చేయాలన్నారు. చెరువులు బాగు చేసి.. ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు కట్టడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతుల సంక్షేమం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన నాయకుడు కేసీఆరే అని అన్నారు. 2014లో రాష్ట్రంలో 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండేవని, కేసీఆర్ దిగిపోయే నాటికి కోటీ 59 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయని తెలిపారు. 30 లక్షల నుంచి కోటీ 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే అది కేసీఆర్ కృషే అన్నారు.
కేసీఆర్ ఘనతను తమదిగా చె ప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చినంక ఒక ప్రాజెక్ట్ అయినా కట్టారా..? ఒక్క చెరువు అయి నా తవ్వారా..? కనీసం రైతుబంధు అయినా ఇచ్చారా..? ఏదీ చేయకుండా పంటల సాగు పెరిగిందని ఎలా చెప్పుకుంటారన్నారు. నిన్న వరంగల్‌లో మహిళల మీటింగ్ పెడితే వారు ఏదైనా శుభవార్త చెప్తారేమో అనుకున్నారు. కానీ ఒక్క మంచి పని అయినా మీరు చేశారా..? అని నిలదీశారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చింది.. షీ టీమ్స్ తో మహిళలకు రక్షణ కల్పించింది కేసీఆరే అని అన్నారు.