ఓటమి భయంతోనే కామారెడ్డికి
కొడంగల్‌లో ఓడిపోతానని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి కామారెడ్డికి పారిపోయాడని కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కోస్గి మండలంలోని నాచారం, చంద్రవంచ, కొత్తపల్లి, తోగాపూర్, ముక్తిపాడ్, ముంగిమళ్ల, ముశ్రీఫా, బోల్వన్ పల్లి, పీసీ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- రేవంత్‌రెడ్డిని కొడంగల్ ప్రజలు నమ్మరు
- 46 వేల మెజార్టీ సాధిస్తాం
- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
కోస్గి, నవంబర్ 11 : కొడంగల్‌లో ఓడిపోతానని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి కామారెడ్డికి పారిపోయాడని కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కోస్గి మండలంలోని నాచారం, చంద్రవంచ, కొత్తపల్లి, తోగాపూర్, ముక్తిపాడ్, ముంగిమళ్ల, ముశ్రీఫా, బోల్వన్ పల్లి, పీసీ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిచెప్పే మాయ మాటలు కొడంగల్ ప్రజలు నమ్మ రన్నారు. కాంగ్రెస్ నాయకులకు గ్రామాల్లో తిరిగి ప్రచారం చేయడం చేతకాక రాత్రి వేళ్లల్లో దొంగల్లా నాయకులును పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కర్ణాటక ప్రజలు చెబుతున్నారని గుర్తు చేశారు. ఐదేండ్లు కొడంగల్‌కు రాని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వచ్చి మాయ మటాలు చేప్పితే కొడంగల్ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు.
కొడంగల్ నియోజవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 46వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఎట్లా పోటీచేస్తున్నావని ప్రశ్నించారు. అనంతరం ఆయన నియోజ కవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చే పట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తోగాపూర్ గ్రామంలో రాధిక అనే మహిళ రేకుల షెడ్డులో ఉండండం చూసి వివరాలు అడిగి తెలుసుకొగా భర్త వదిలివెళ్లిపోయాడని ఇద్దరి పిల్లలతో ఒంటరిగా ఉంటున్నాని కన్నీరు పెట్టగా ఎమ్మెల్యే నూతన ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కడంపల్లిలో 20మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాశ్ రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, వైస్ ఎంపీపీ సాయిలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంతు రెడ్డి, నాయకులు సుభాష్, అంజిలయ్య, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్, బాలయ్య, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మోహన్ గౌడ్, రాము నాయక్, వెంకట్ నర్సింహులు , విష్ణు, రాములు, సాయి, దినేశ్ తదితరులు పాల్గ్గొన్నారు.
గ్రామాలన్నీ గులాబీ మయం
మద్దూర్ (కొత్తపల్లి), నవంబర్11: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతుండడంతో గ్రామాలన్ని గులాబీమయమౌతున్నాయని కొడంగల్ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని దోరేపల్లి వార్డు సభ్యుడు మొగులాలి ఆధ్వర్యంలో 80 మంది మైనార్టీ యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజలు దృష్టి తెలంగాణ వైపు మళ్లిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధే నన్ను మరోసారి గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

