నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ), నవంబర్ 19 : నా భర్త, మీ అన్న, మీ ఇంటి పెద్ద బిడ్డ, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెఢ్డి ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 17వేలమందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు, రూ.5కే మంచి భోజనం, పేదలకు ఘనంగా సామూహిక వివాహాలు చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నారు. పేదలకు సామాజిక సేవ చేయడమే లక్ష్యంగా మర్రి ముందుకు సాగుతున్నారు. పదేండ్లలో నాగర్‌కర్నూల్‌ను ఎంతో వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నం. విజన్ ఉన్న ఎమ్మెల్యే ఎలా ఉంటారనే విషయాన్ని చేసి నిరూపిస్తున్నారు నా భర్త. ఈరోజు చేసిన సేవా కార్యక్రమాలకు మేము ఏనాడూ ప్రతిఫలం కోరలేదు. ఈరోజు మీ మనస్సులు ఖరాబు చేయాలని చాలామంది బయలుదేరారు.
వారి మాటలు పట్టించుకోవద్దు. మేం ఇచ్చిన హామీల్లో 90శాతానికి పైగా అమలు చేశాం. బీఆర్ఎస్ మన కుటుంబం. మనలో మనం కొట్టుకుందాం. తిట్టుకుందాం.. కానీ కాంగ్రెస్‌కు మాత్రం అవకాశం ఇవ్వొద్దు. ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా.. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే.. 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి మర్రన్నను మూడోసారి ఆశీర్వదించాలి. గతానికంటే అధిక మెజార్టీ ఇవ్వాలి. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయాలో మేం చూసుకుంటాం. మర్రన్న బిజినెస్‌లో గోల్ పెట్టుకొని లక్ష్యం సాధించిండు. రాజకీయంలో ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకొని సేవ చేస్తున్న తత్వం మర్రి జనార్దన్‌రెడ్డిది.