సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. మర్రి నామినేషన్‌తో నాగర్‌కర్నూల్ మొత్తం గులాబీ మయంగా మారింది.
- నాగంతో కలిసి కందనూలును ఇంకా బాగు చేస్తాం
- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- మర్రి గెలుపు ఖాయం
- మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
- అట్టహాసంగా నామినేషన్ దాఖలు
నాగర్‌కర్నూల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. మర్రి నామినేషన్‌తో నాగర్‌కర్నూల్ మొత్తం గులాబీ మయంగా మారింది. వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు బైకులతో ర్యాలీగా ఉయ్యాలవాడ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి పటాకులు పేల్చుతూ డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తాలోని వెలమ ఫంక్షన్ హాల్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సాకారంతో నాగర్‌కర్నూల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి కందనూలును ఇంకా బాగు చేస్తామని వివరించారు. మూడో సారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డ నన్ను ఆశీర్వదించాలని కోరారు. ప్రతి నాయకుడు, కార్యకర్త నా గుండెల్లో ఉంటారని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానన్నారు.
రాబోయే కాలంలో మీ అందరికీ నేను అండగా ఉంటానని, స్థానికంగా ఉన్నా వ్యక్తిగత విభేదాలను పట్టించుకోవద్దని, ఇతరుల మాటలు నమ్మొద్దని సూచించారు. కొందరు స్వార్థపరులు పార్టీలు మారుతున్నారని, వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచాకా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీ హబ్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు దేశ్‌ముఖ్ దొరకు పేద బిడ్డకు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కందనూలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. ఈ నెల 19న నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్ వస్తున్నారని, నియోజకవర్గం నుంచి లక్ష మంది పాల్గొనేలా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. నాగం అనుభవంతో ఎన్నికల్లో ముందుకు సాగుదామని, నాయకులు అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తూడుకుర్తి దొరలు, పేద బిడ్డలకు జరుగుతున్న ఎన్నికలు అని, తూడుకుర్తి దొరలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
దామోదర్‌రెడ్డి తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐదు సార్లు ఓటమి పాలైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, రానున్న ఎన్నికల్లో ఆరో సారి కూడా ఓటమి కావడం ఖాయమని జోష్యం చెప్పారు. నేను ఏదైనా పట్టుబడితే విడవనని, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి నాలుగున్నర నెలలు జైలులో ఉన్నానన్నారు. నాగర్‌కర్నూల్‌లో నగారా సమితి పెట్టి ఉద్యమం చేశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పారాచూట్ నాయకులకు టికెట్లు ఇచ్చారని, పాపులారిటి సర్వే చేశానన్న రేవంత్ మాటలు తప్పు అని, రైతులు బాగు పడాలంటే కేసీఆర్ సీఎంగా ఉండాలన్నారు. ప్రతి రైతు పొలానికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను, మర్రి చూసుకుంటామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు లాంటి పథకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ప్రజలకు అందాయని, మూడో సారి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్‌రెడ్డి విజయం ఖాయమని ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

