జల పరవశం
ఐదు గ్రామాలు.. 17 తండాలు.. 7,310 ఎకరాలకు సాగునీరందించే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యయి. రెండు పంపు పనులు పూర్తి కాగా, ఒక పంపును శుక్రవారం రాత్రి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, ఏఈ శివరాంలు డ్రైరన్ చేశారు. దీంతో మండలంలోని కేఎల్ఐ కాల్వ ద్వారా నీరు అందని 5 గ్రామాలు, 17 తండాలు సస్యశ్యామలం కానున్నాయి.
- మార్కండేయ పంపు-1 ప్రారంభం
- రూ.77 కోట్లతో లిఫ్ట్ నిర్మాణ పనులు
- 7,310 ఎకరాలకు సాగునీరే లక్ష్యం
- ఐదు గ్రామాలు, 17 తండాలు సస్యశ్యామలం
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మర్రి
- బిజినేపల్లి, ఖిల్లా మండలాల రైతుల్లో ఆనందం
బిజినేపల్లి, నవంబర్ 18 : ఐదు గ్రామాలు.. 17 తండాలు.. 7,310 ఎకరాలకు సాగునీరందించే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యయి. రెండు పంపు పనులు పూర్తి కాగా, ఒక పంపును శుక్రవారం రాత్రి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, ఏఈ శివరాంలు డ్రైరన్ చేశారు. దీంతో మండలంలోని కేఎల్ఐ కాల్వ ద్వారా నీరు అందని 5 గ్రామాలు, 17 తండాలు సస్యశ్యామలం కానున్నాయి. మొత్తం ఈ లిఫ్ట్ కింద 7,310 ఎకరాలకు సారునీరు పుష్కలంగా అందనున్నది. రైతుల పొలాలకు నీరందక సతమతమవుతున్న తరుణంలో 2022 సంవత్సరంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ పనులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరు నెలల్లో పూరి ్తచేస్తామని చెప్పగా, కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఏడు నెలలకాలంలో లిఫ్ట్ పనులు పూర్తి చేసి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. గత పాలకులు కేఎల్ఐ కాల్వను బిజినేపల్లి మండలంలో కిలోమీటర్ల మేర తీసుకెళ్లారు. కానీ కాల్వ పైభాగం ఎత్తు ప్రాంతంలో ఉన్న పంట పొలాలకు నీరందించలేకపోయారు. దీంతో నాటి నుంచి నేటి వరకు పక్కనే కృష్ణమ్మ నీరుపారుతున్నా పంటలకు సాగునీరు అందక రైతులు గోసపడేవారు. కేవలం వర్షాధార పంటలను మాత్రమే పండించుకునేవారు. మిగిలిన గ్రామాలు, తండాల రైతులు పొలాలకు నీరు అందించాలనే ఉద్దేశ్యంతో పట్టువీడని విక్రమార్కుడిగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో కొట్లాడి కొత్తగా మార్కండేయ రిజర్వాయర్‌ను మంజూరు చేయించారు.
ఈ రిజర్వాయర్ మొదట 130 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా, రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేవలం ఏడు ఎకరాల నష్టంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా, బిజినేపల్లి మండలంలోని శాయిన్‌పల్లి గ్రామం కేఎల్ఐ కాల్వ 22.7 కిలోమీటర్ల వద్ద మోటర్లను ఏర్పాటు చేసి లిఫ్ట్ ద్వారా మండలంలోని కీమ్యాతండా సమీపంలో సింహారెడ్డి కుంటను అర టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించారు. అంతేకాకుండా గ్రావిటీ కెనాల్ కిలోమీటర్ మేర పూర్తయ్యింది. ఈ రిజర్వాయర్‌ను కృష్ణమ్మ నీటితో నింపి మండలంలోని శాయిన్‌పల్లి, పోలేపల్లి అనే రెండు కుడి, ఎడమ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందించనున్నారు. కాగా, ఈ రిజర్వాయర్‌కు మూడు కిలోమీటర్ల మేర పైపులైన్, రెండు కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్ పనులు పూర్తికాగా, పైప్‌లైన్ కాల్వ పనులు చేపట్టనున్నారు. దీంతో రిజర్వాయర్ పనులు పూర్తవడంతో చుట్టుపక్కల గ్రామాలు, తండాలు సస్యశ్యామలం కానున్నాయి. ఎన్నో ఏండ్లుగా పంటల సాగునీటికోసం ఎదురుచూసిన రైతుల కల నెరవేరింది. బీడుభూములు కృష్ణాజలాలతో తడవడం ద్వారా వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
గ్రామాలు, తండాలు సస్యశ్యామలం..
మార్కండేయ రిజర్వాయర్ బిజినేపల్లి మండలంలోని శాయిన్‌పల్లి, గంగారం, లట్టుపల్లి, మమ్మాయిపల్లి, పోలేపల్లి ఇలా ఐదు గ్రామాలతోపాటు వసురాంతండా, పెద్దతండా, కేతరిబండ తండా, కీమ్యాతండా, పెద్ద హేమ్లాతండా, ఎర్రకుంట తండా, అలుగుతండా, బద్యానాయక్తండా, ఇప్పలతండా, రావులచెరువుతండా, బొడుసుగడ్డ తండా, చిన్నపీర్ తండా, పీర్యాతండా, ఫుల్సింగ్తండా, భీముని తండా, కాట్రావత్ తండా, నల్లగడ్డ తండా, శాయిన్‌పల్లి తండాలతోపాటు వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం మండలంలోగల సోలీపూర్, జంగమాయిపల్లి, రుక్కన్నపల్లి, షాపూర్, కర్నెతండా, దొంతిగుంటతండా, ఆమోదంబండ తండా, గరయ్యబండతండా, కుంటముందరి తండా, పోతులకుంట తండా, ఎర్రగడ్డ తండా, ఫామ్రెడ్డిపల్లి తండా ఇలా మూడు గ్రామాలు, ఎనిమిది తండాలకు సాగునీరు అంది పంటపొలాలు సస్యశ్యామలం కానున్నాయి. కాగా ఇదివరకే కెఎల్ఐ కాల్వ ద్వారా లక్షకుపైగా ఎకరాలకు సాగునీరు అందుతున్న విషయం తెలిసిందే. మార్కండేయ రిజర్వాయర్ ద్వారా 8వేల ఎకరాలకు సాగునీరు పుష్కరలంగా అందనున్నది. దీంతో పల్లెలు, తండాలు అభివృద్ధి చెందడంతోపాటు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేఎల్ఐ ద్వారా వచ్చిన నీటిని మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేసిన చెరువు కుంటల్లో నింపి పంటలను పండించడం జరుగుతుంది. ప్రధానంగా మండలంలోని వడ్డెమాన్, ఖానాపూర్, పాలెం, పెద్దచెరువులతోపాటు తదితర గ్రామాలు తండాల్లో ఉన్న కుంటల్లో నీటిని నింపి పంటల సాగుకు అందించనున్నారు. ఇదేగాక గతంలో కంటే సాగు పెరగనున్నది. గతంలోకంటే చెరువు కుంటల్లో నీరు పుష్కలంగా ఉండడంతో చేపలను పెంచుకొని విక్రయిస్తూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందనున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..
మండలంలోని 5 గ్రామాలు, 17 తండాలకు కేఎల్ఐ నీరు రాకపోవడంతో ఆరు నెలల్లో మార్కెండేయ రిజర్వాయర్ పూర్తి చేసి నీరు అందిస్తానని మాట ఇచ్చా. ఆ మేరకు మోటారు రన్ చేసి రిజర్వాయర్‌కు నీటిని నింపుతున్నాం. కేఎల్ఐ కాల్వకు ఎగువ ప్రాంతంలో ఈ గ్రామాలు ఉండడం వల్ల గత పాలకులు పంట పొలాలకు నీటిని అందించలేకపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రూ.80కోట్ల వ్యయంతో రిజర్వాయర్‌ను మంజూరు చేయించా. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2022లో మంత్రి కేటీఆర్ రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. తక్కువ భూమిని రైతులు కోల్పోయేలా ఎక్కువ సమయం తీసుకొని డిజైన్ చేసి రిజర్వాయర్ పూర్తి చేశాం. రిజర్వాయర్ పూర్తి కావడంతో బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం కానున్నాయి.
-మర్రి జనార్దన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

