రాజాపూర్, అక్టోబర్ 27 : పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పలుగుతండా, కల్లెపల్లి, అగ్రహారం పోట్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిర్వహించారు. తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షే మ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మద్దతుగా బ్రహ్మరథం పట్టారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల బంగారు భ విష్యత్‌కు తలమానికంగా మారనున్నాయని, ఆలోచించి ఓటు వేయాలని కోరా రు. అభివృద్ధ్దికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులకు రాజ్యాధికారం కట్ట్టబెట్టిన సీఎం కేసీఆర్ ఆరాధ్యుడన్నారు. గిరిజనుల వెనకబాటుతనం రూపుమాపేందుకు 10శాతం రిజర్వేషన్లు చేశారని తెలిపారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, ఎంపీపీ సుశీల, జెడ్పీటీ సీ మోహన్‌నాయక్,వైస్ ఎంపీపీమహిపాల్రెడ్డి,ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, స ర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బ చ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ మండలాధ్యక్షుడు వెంకటేశ్, సత్యయ్య, మహిపాల్‌రెడ్డి, యాదగిరి, ఆనంద్‌గౌడ్, సర్పంచులు కవిత, సాయమ్మ పాల్గొన్నారు.
జడ్చర్ల, అక్టోబర్ 27 : జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలం జగబోయిన్పల్లికి చెందిన మాజీ డిప్యూటీ సర్పంచ్ దేవరాజ్‌తోపాటు ముఖ్య నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో రవి, శ్రీశైలంతోపాటు పది మంది ఉన్నారు.