దళితబాంధవుడు సీఎం కేసీఆర్
దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలుచేస్తూ దళితబాంధవుడిగా నిలిచారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమం త్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
- ప్రభుత్వ పథకాలతో దళితుల జీవితాల్లో మార్పు
- అంబేద్కర్ ఆశయసాధనకు అందరూ పాటుపడాలి
- జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 14 : దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలుచేస్తూ దళితబాంధవుడిగా నిలిచారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమం త్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో అమలుచేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా బాగుపడడంతోపాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. అంతేకాకుండా బలహీనవర్గాల అభ్యున్నతికి పిం ఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమ లు చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీనవర్గాల కోసం పాటుపడిన అంబేద్కర్‌ను భవిష్యత్తు తరాలు గుర్తు చేసుకునేలా హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పా టు చేశారన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం కులమతాల పేరుతో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, వారి మాయలో పడొద్దని, అందరూ కలసిమెలిసి ఐక్యంగా ఉండాలని సూచించారు. అనంతరం బాదేపల్లి పాతబజార్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భవన నిర్మాణానికి శంకుస్థాపన
జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్ సబ్‌డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఎస్జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, కొంగళి జంగయ్య, నాగరాజు, జంగయ్య, బాల్‌రాజ్, సత్యం, శివదర్శన్, మోహన్‌రాజ్, పీఆర్ డీఈ హీర్యానాయక్, ఎంపీడీవో ఉమాదేవి, ఏఈ జవహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

