తాడూరు, ఏప్రిల్ 11 : ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకూ అం డగా ఉంటామని ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రె డ్డి అన్నారు. తాడూరు మం డలం ఇంద్రకల్ గ్రామంలోని మహాలక్ష్మి కాటన్ మిల్లులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 8 ఏండ్ల కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
70 ఏండ్లపాటు దేశాన్ని, రాష్ర్టాన్ని ఎన్నో పార్టీలు పాలించినా.. ఒక్కరోజు కూడా గ్రామాల్లోని ప్రజలు, రైతుల కష్టాలను పట్టించుకోలేదన్నా రు. అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా కేసీఆర్ ప్రభు త్వం ఎన్నో కార్యక్రమాలను చే పట్టిందన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉం డేదని.. ఎండాకాలం వస్తే తాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రోజులున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తాగునీటి సమస్య కు మిషన్ భగీరథతో చెక్ పెట్టారన్నారు. రా ష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఇతర రాష్ర్టాలకు తెలంగాణకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదింట ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా సాయం అందించి సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారాడన్నారు.
ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా
ఇప్పటివరకు 800మంది జంటలకు పెండ్లిళ్లు చేశానని వివరించారు. సిర్సవాడ, తాడూరు గ్రామాల్లో ఎం జేఆర్ ట్రస్టు ద్వా రా దాదాపు రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పూర్తి చేశామన్నారు. రెండు నెల ల్లో ఈ పాఠశాలలను ప్రా రంభిస్తామన్నారు. అదేవిధం గా జిల్లాకేంద్రంలో ఎస్పీ, కలెక్టరేట్ నూతన కార్యాలయాలు నిర్మించామని, వాటిని కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో పేదల వైద్యం కోసం 330 పడకల దవాఖాన పనులు జరుగుతున్నాయని, దీ నిని సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ రాములు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వా తే బీఆర్ఎస్ హయంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందనారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని 70వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీం తో రైతులు నీటికొరత లేకుండా పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. 8 ఏండ్ల కాలంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదన్నారు. సమ్మేళనంలో ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమున, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, బైకని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యార రమేశ్, సింగిల్‌విండో చైర్మన్ సమ్మద్పాషా, ఎంపీపీ శ్రీదేవి, వైస్‌ఎంపీపీ శివలీల, గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్‌రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.