అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 18 : ఆటో డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఏడాది కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నా వారి సమస్యలను పట్టించుకోరా అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వంద మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చే సుకున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల ఆందోళనకు సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుకుం టూ వెళ్లగా ఎమ్మెల్యే విజయుడు కేటీఆర్‌తో కలిసి కార్యక్రమంలో పా ల్గొని ఆటో డ్రైవర్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదై నా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆటో డ్రైవర్లు అప్పుల పాలు కావడంతోపాటు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఆటోడ్రైవర్ల సమస్యను పరిషారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.