మరికల్ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అప్పంపల్లి గ్రామంలో బాలన్నగారి రాంరెడ్డి- సత్యమ్మల జ్ఞాపకార్థం మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న అంబలి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
జై భీమ్, జై బాపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సన్నబియ్యం రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్,ఉచిత బస్సు,తదితర సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం అప్పంపల్లి గ్రామంలో జై భీమ్,జై బాపు కార్యక్రమ ఉద్దేశాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు.
తీవ్రవాదుల దాడిని ఖండించిన ఎమ్మెల్యే..
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం లో టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేయడం హేమమైన చర్యగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ దాడిని పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న, జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, బాలన్నగారి మోహన్ రెడ్డి, ధన్వాడ సింగల్ విండో చైర్మన్ వై. వెంకట్రాంరెడ్డి నారాయణరెడ్డి, కృష్ణయ్య, వినీతమ్మ, నారాయణ, హరీష్ కుమార్, బి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి, పాండు రెడ్డి, సత్యన్నారాయణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.