చిన్నంబావి, ఏప్రిల్ 11: బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. చిన్నంబావిలో మంగళవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని మండల అధ్యక్షుడు ఈదన్నయాదవ్ అధ్వర్యంలో నిర్వహించగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు బీరంతోపాటు చల్లాను పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ వి జయం ఖాయమైందని.. ఇది గుర్తించిన ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టె రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశంలో రైతువ్యతిరేక చట్టాలపై పో రాటం చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం పిలిచి సత్కరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మార్గదర్శిగా నిలవబోతుందన్నారు.
వ్యక్తిగత అవసరాల కేసమే పార్టీ మార్పు: ఎమ్మెల్యే బీరం
వ్యక్తిగత అవసరాల కోసం బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకొ ని.. ఇప్పుడు అదే పార్టీని విమర్శిస్తున్నారని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫైర్ అయ్యారు. ఇటీవల సోషల్‌మీడియాలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. అటువంటి వారి మాటలను తిప్పికొట్టాలన్నారు. రెండు దశాబ్దలుగా మరుగున పడిన అభివృద్ధిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో పూర్తిచేస్తున్నానన్నారు. సోమశిల-సిద్ధేశ్వరం ప్రాజెక్టు ని ర్మాణానికి ఎంతో కృషి చేస్తే కొంతమంది తాము తీసుకొచ్చామని గంగిరెద్దుల వేశాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మండలంలో రూ.4కోట్లతో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణం, రూ.1.50కోట్లతో గూడెం రోడ్డు, రూ.2.50కోట్లతో కాశిరెడ్డివాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. అదేవిధంగా కొప్పునూరు గ్రామంలో ఇంటి పైకప్పులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని.. మండలానికి వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామన్నా రు.
ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేలా చ ర్యలు తీసుకుంటామన్నారు. మండల ప్రజలకు ఏ స మస్య వచ్చినా తన దగ్గరకు నేరుగా రావొచ్చని.. పరిష్కారం కో సం తనవం తు కృషి చేస్తానన్నారు. రా నున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వ స్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం స్వార్థం కో సమే తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి జూపల్లి విమర్శలు చేశారని ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రమణమ్మ అ న్నారు. బీఆర్ఎస్లో ఇన్ని రోజులు పబ్బం గ డుపుకొన్న జూపల్లి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసి న వెంటనే తనకు పార్టీలో సభ్య త్వం లేదని అనడం సిగ్గుచేటన్నారు. ప్రజల విశ్వాసం కో ల్పోయినా ఆయనకు ఇంకా అధికార అహం దిగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ ప్రజలు జూపల్లికి తగిన బుద్ధి చెప్తారన్నారు. స మావేశంలో మార్కెట్‌కమిటీ చైర్మ న్ కిషన్‌నాయక్, సింగిల్‌విండో చై ర్మన్ నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు మధు, ఉమ్మడి మండలాల వ్యవహారాల ఇన్చార్జి శ్రీధర్‌రెడ్డి, సర్పం చ్ మద్దిలేటి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, పాల్గొన్నారు.