గద్వాల, ఆగస్టు 2 : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత సీఎం కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూసిన కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. జిల్లాలో 450 మంది ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న సీ ఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు ఆర్టీసీ కార్మికులు ఎల్లప్పుడూ రు ణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీ రాజారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు సుభాన్, తిమ్మారెడ్డి, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల తెలిపారు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లాకు మంజూరైన 108, 102 వాహనాలను బుధవారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని ర కాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లో అంబులెన్స్ చేరుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో దవాఖానలకు అంబులెన్స్‌లను మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బా బర్, దవాఖాన సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి, శ్రీనివాసులు, దౌలు, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, తిమ్మారెడ్డి, గోవిందు, సాయిశ్యాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు