ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించండి
ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే ఆల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం
- హాజరైన ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
భూత్పూర్, మార్చి 15 : ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గంలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు, మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ని యోజకవర్గంలో దాదాపు 80శాతం ఎంపీటీసీలు, 100శాతం జెడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీ కి చెందిన వారే ఉన్నారని వారంతా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.
అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓ ట్లే ఎక్కువగా ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా అ త్యధిక ఎంపీటీసీలు ఉన్నారని గుర్తు చేశారు. అందరూ కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీలను మరిచి రోజుకోమాట చెబుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి పెద్ద నాయకుల నుంచి, సామా న్య కార్యకర్తల వరకు అందుబాటులో ఉండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వనపర్తి జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీలు గుంత మౌనిక, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

