ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన వంశీకి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు.
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేత
దేవరకద్ర, డిసెంబర్ 5: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకే సీఎంఆర్ఎఫ్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన వంశీకి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతపాలనలో నిరుపేదలు వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కోసం దరఖాస్తు పెట్టుకున్నా.. ఎటువంటి ఆర్థిక సాయం అందేదికాదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికసాయం అందిస్తుందన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకరకాల సంక్షేమ పథకాలను అన్నివర్గాల ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని గడపగడపకూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలతో నిరుపేదల బతుకులో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ ప్రజలకు అండగా ఉన్నారన్నారు. దేశలో ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఖదీర్‌పాషా, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పరమేశ్, కుర్వ రాము, శంకర్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

