దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), జూలై 17 : రైతు లేని దే రాజ్యం లేదనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తుంటే, వారిని అట్డడుగుకు తొక్కాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. అటువంటి పార్టీలు, నాయకులకు రా ష్ట్రంలో స్థానం లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎం డగడుతూ కౌకుంట్లలో రైతులతో సోమవారం నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅథితిగా హజరై మాట్లాడారు. తెలంగాణలో తప్పా మరో రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదని ఆయన తేల్చి చెప్పారు. 2014కు ముందు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉం డేదన్నారు. 9 గంటల కరెంటును 7గంటలకు కు దించి, రెండు విడుతల్లో ఇచ్చేవారన్నారు. ఆ విడుతల్లోనూ ఎన్నోసార్లు అంతరాయం కలిగేదన్నారు. అటువంటి కష్టాల నుంచి గట్టెక్కించిన బీఆర్ఎస్ ప్ర భుత్వానికి రైతులు వెన్నంటి ఉండాలని సూచించా రు. 24గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్వలేని రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంటు సరిపోతుందని మా ట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
రైతుబంధు డబ్బులు తీసుకుంటూ, 24 గంటల కరెంటుతో సాగు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అటువంటి నాయకులకు తగిన గుణపాటం చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి వారిని తరిమేయాలన్నారు. తెలంగాణ వస్తే చీకట్లో ఉండాలన్న కిరణ్‌కుమార్‌రెడ్డి చీకట్లో కలిసిపోయాడని ఎద్దేవా చేశారు. 11సార్లు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అప్పుడు పా లమూరు జిల్లా నుంచి 14లక్షల మంది వలస వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ సారథ్యంలో రైతులందరూ సంతోషం గా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ. 35వేల కోట్లతో కరివెన ప్రాజెక్టు మంజూరై పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. రెండు ఊకచెట్టు వా గుల్లో రూ.170 కోట్లతో 21 చెక్‌డ్యాంలు నిర్మించుకున్నామన్నారు. దీంతో సాగు విస్తీర్ణం 35వేల నుం చి 95వేలకు పెరిగిందని వివరించారు. కార్యక్రమం లో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్‌ఎంపీపీ సుజాత, ఎంపీటీసీలు కిష్టన్న, నారాయణ, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొండారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
30 ఎకరాలకు 3 గంటల కరెంటు సరిపోతదా?
మూడు గంటల విద్యుత్తు చాలంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే మతి భ్రమించినట్లుంది. అధికారం రావాలని మాట్లాడాడా.. లేక అస్త్ర సన్యాసం తీసుకోవాలని మాట్లాడాడా అనేది అర్థం కావడంలేదు. మా కుటుంబానికి 30 ఎకరాలు పొలం ఉంది. 24 గంటల విద్యుత్తుతో గుంట మిగులకుండా పొలాన్ని సాగు చేసుకుంటున్నాం. ఓ దఫా 500 బస్తాల ధాన్యాన్ని పండిస్తున్నాం. మూడు గంటల విద్యుత్తుతో నా మొత్తం పొలం సాగు అవుతుందా?
– సురేశ్, రైతు, మాచర్ల
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు
కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చి మా ఇ బ్బందులు తీర్చిం డు. లేకపోతే ఇంత ఆయకట్టు సాగయ్యే ది కాదు. ఇన్ని పంట లు పండేవి కాదు. పొలాల కాడ రాత్రి, పగలు తిరిగితేనే రైతుల కష్టం తెలుస్తది. పాములు, తేళ్లు కుట్టి చాలామంది రైతులు చనిపోయారు. కాంగ్రెసోనికి ఏం తెలుస్తుంది రైతుల ఇబ్బందులు. కొన్ని రోజులు మా వెంట ఉండి చూడు రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంటు సంగతి తెలుస్తది. ఆ కరెంటుకు ఎంత పొలం పారుతుందో, ఎంత పంట పండుతుందో నీకూ తెలుస్తది. మా సంతోషం చూడాలనుకుంటున్న కేసీఆర్ మాకు దేవుడితో సమానం.
– కురుమూర్తి, రైతు, పుట్టపల్లి
రైతుల కష్టాలు రేవంత్‌కు తెలుసా?
కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు కరెం టు కోసం మస్తు క ష్టాలు పడ్డాం. సీఎం కేసీఆర్ వచ్చినంక రై తులకు అవసరమైనంత కరెంట్ వస్తుం ది. కాంగ్రెస్ హ యాంలో కరెంటు ఎ ప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి. కరెంటు కోసం బావుల వద్ద తెల్లందాక పడిగాపులు కాసేవాళ్లం. మా కష్టాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో మూడు పంటలు పండించుకొని సంతోషంగా ఉ న్నాం. గతంలో పెట్టుబడి రాక ఎంతోమంది రైతు లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు రైతన్నకు కష్టం రాకుండా కేసీఆర్ పథకాలను అమలు
చేస్తున్నారు.
– నర్సింగ్‌రావు, రైతు, ఉడిత్యాల
మా బతుకులు ఆగమే..
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తోనే రెండు పంటలు పండించుకుంటున్నాం. నాకున్న పొలంలో ఎండాకాలంలో 150 బస్తాల వండ్లు పండించిన. 10 ఏండ్ల కిందట యాసంగిలో రెండు మడుల వరి నాటేస్తే కరెంట్ సక్కగ లేక పంట ఎండిపోయేది. ఇప్పుడు పునాస, యాసంగిలో ఎప్పుడూ కరెంట్ ఉండడంతో పంటలు పండిస్తున్నం. తెలంగాణ వచ్చాకే పెట్టుబడికి అపుపకోసం షావుకారు వద్దకు పోవాల్సిన అవసరం లేకుండా రైతుబంధు అందుతున్నది. సమయానికి విత్తనాలు, ఎరువులు అందుతున్నయ్. రైతులకు ఇంతకన్నా ఏం కావాలి.
– శంకరయ్య, రైతు, రాయపల్లి