దేవరకద్ర, డిసెంబర్ 30: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రానికి చెందిన రైతు నర్సింహారావు మృతిచెందాడు. ప్రభుత్వం నుంచి మంజూరైన రైతుబీమా రూ.5లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆల శుక్రవారం అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు కొండా భాస్కర్‌రెడ్డి, కుర్వరాము, కొండల్, ఎండీ ఖాజా, వెంకటేశ్ పాల్గొన్నారు.
మండలంలోని గోపన్నపల్లికి చెందిన రాచూరి ప్రసన్న చదువుకు సంబంధించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.10వేల ఆర్థిక సాయం చేసి, భవిష్యత్‌లో చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రసన్న నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. హైదరాబాద్‌లోని యశోద మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం ఇన్‌చార్జ్జి సత్యనారాయణ, వెంకట్రాములు, రాజారెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు అయ్యప్పస్వామి కృప ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరుకున్నారు. మండలకేంద్రంలోని సంకల్పసద్ధి హరిహర అయ్యప్ప క్షేత్రంలో గురువారం రాత్రి నిర్వహించిన మహాపడి పూజకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సంకల్పసద్ధి అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో స్వాగతం పలికి సన్మానించారు. స్వామివారికి మండల ప్రజాప్రతినిధులు, స్థానికులతోపాటు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్పస్వామి ఆలయం వద్ద షెడ్డు ఏర్పాటు చేయాలని కోరడంతో నివేదికలు తయారు చేసి తీసుకురావాలని సూచించడంతో గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ జానపద కళాకారుడు జంగిరెడ్డి బృందం అయ్యప్పస్వామిని కొనియాడుతూ పాడిన పాటలు, భజనలు ఆకట్టుకున్నాయి. అలాగే మండలంలోని వేములకు చెందిన పెద్ద కుర్వసాయమ్మ, ఎర్ర శాంతమ్మ ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం వేములలోని ఇరు కుటుంబాల ఇండ్లకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయమ్మ, శాంతమ్మ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.