మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 1 : “రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. అందుకే వారికి కోతలు లేని కరెంటు ఇచ్చిండు, తర్వాత పె ట్టుబడికి ఇబ్బంది పడొద్దని రైతుబంధు ఇచ్చిండు..” అని దేవరకద్ర ఎమ్మెలే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కందూరు అనుబంధ గ్రామం గౌరిదేవునిపల్లికి వెళ్లేందుకు పెద్దవాగుపై రూ.2.35కోట్లతో నిర్మించిన కాజ్వే (వంతేన)ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంత రం ఆయా గ్రామాల్లో చెక్‌డ్యాం పనులకు భూ మిపూజ, సామూహిక భవనాల ప్రారంభం, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, పాఠశాల భవనాలను ప్రారంబించారు. అనంతరం రాచాలలో 28మందికి గృహలక్ష్మి ప్రొసీడిం గ్స్, 10మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ చావు అంచుల దాకా వెళ్లి తెలంగా ణ రాష్ర్టాన్ని సాధించారని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావొద్దనే రైతు సంక్షేమానికే ప్రభుత్వం ప్రా ధాన్యం ఇచ్చిందన్నారు.
100 కి.మీ. నుంచి కృష్ణా జలాలు పెద్దవాగు ద్వారా రాచాలకు చేరుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులతోపాటు ఉద్యోగులు, యువకులు, రైతులు, మహిళలు ఎంతోమంది లా ఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారని, వందలమంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్న తర్వాతనే తెలంగాణ వచ్చిందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌కు మద్దతుగా మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నృత్యం చేయగా ఎమ్మెల్యే అభినందించి వారికి ఉద్య మ గేయాలు నేర్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల తరఫున ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, ఎంపీడీవో మంజుల, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, కందూరు ఆలయ చైర్మన్ రమేశ్‌గౌడ్, స ర్పంచులు జయన్నగౌడ్, శ్రీకాంత్, క ల్పన, తిరుపతయ్యయాదవ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాచాల ఓటు.. కారు గుర్తుకే
రాచాల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ తిరుపతయ్యయాదవ్ మాట్లాడారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించి మరిన్ని పనులు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే పనులు మాత్రమే అడుగుతారా, ఈ సారైనా కారు గుర్తుకు ఓటేస్తారా? అని అడిగారు. ఈక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ అభివృద్ధికి కృతజ్ఞతగా గతానికి మించి గ్రామం తరఫున 99శాతం ఓట్లు కారు గుర్తుకే వేస్తామని ప్రకటించారు. ఇందుకు సర్పంచ్‌ను ఎమ్మెల్యే అభినందిస్తూ ఇతర పార్టీలో ఉన్నా.. గ్రామ అభివృద్ధికి కృతజ్ఞతగా కారు గుర్తుకు ఓట్లు వేస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను కూడా గ్రామాభివృద్ధికి కంకణబద్ధుడినై ఉంటానని వారికి హామీ ఇచ్చారు.