భూత్పూర్, సెప్టెంబర్ 15 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. శుక్రవారం భూత్పూర్ చౌరస్తాలో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం కేఎమ్మార్ ఫంక్షన్ హాల్లో 43మంది మైనార్టీలకు రుణాలు, 200మంది మహిళలకు కుట్టమిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోని లేని అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలోనే జరుగుతుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఘర్షనలు చోటుచేసుకుంటుండగా, తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని ఎలాంటి అల్లర్లు లేవని గుర్తు చేశారు. అనంతరం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ మాట్లాడుతూ మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే వాడుకుందని, సీఎం కేసీఆర్ వచ్చాకే గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. మైనార్టీల అభివృద్ధికి ఇంతలా కృషి చేస్తున్న కేసీఆర్ వెంట అందరూ నడవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, వనపర్తి జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీలు శేఖర్‌రెడ్డి, రమాశ్రీకాంత్యాదవ్, మౌనిక, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, రాజశేఖర్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, ఎంపీడీవో మున్ని తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు ‘డబుల్’ ఇండ్లు
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే ఆల అన్నారు. మండలంలోని కొత్తూర్‌లో నిర్మిస్తున్న 40 ఇండ్లకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. నియోజకవర్గంలో దాదాపు 1,800 ఇండ్లు నిర్మించామని, కొత్తగా మరో 1,500 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీలో 288 ఇండ్లను పంపిణీ చేశామని, మద్దిగట్లలో 80 ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మన్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, సర్పంచ్ యాదయ్య, కౌన్సిలర్ శ్రీ నివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నారాయణగౌడ్ తదితరులున్నారు.