మక్తల్ టౌన్, డిసెంబర్ 29 : వచ్చేనెల చివరి వరకు పట్టణంలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికీ తా గునీటిని అందించాలని ఎమ్యెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని అధ్యక్షతన గురువా రం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ఎమ్యెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరై ఎజెండా అంశాలను ప్రారంభించారు. అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 9వ వార్డు కౌన్సిలర్ రాధిక, 1వ వార్డు కౌన్సిలర్ శ్వేత ఎ జెండాలో పొందుపర్చిన అంశాలు తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే సమావేశంలో తీర్మానాలను ఆ మోదించాలని చైర్పర్సన్, కమిషనర్ నిర్ణయం తీసుకోవ డం ఎంతవరకు సమాజసమన్నారు. పలు విషయాలపై స భ్యులు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశ మందిరం కొద్దిసేపు వాతావరణం వేడెక్కింది.
ఎమ్మెల్యే చిట్టెం కల్పించుకొని సభ్యులు గౌరవ మర్యాదలు పాటిస్తూ హుందాతనంగా వ్యవహరించాలన్నా రు. ఎమ్యెల్యే సూచించడంతో కమి షనర్ సభ్యులకు క్షమాపణ చెప్పారు. 5, 12, 14, 15వ వార్డుల్లో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా చేసి వ దిలేయడం జరిగిందని కౌన్సిలర్లు స భాదృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించే విధంగా సభ్యులు సమూహంగా ఏర్పడి ఆదాయం వచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేవించారు.
ప్రతి ఇంటికీ మొక్కలు నాటే కార్యక్రమానికి రూ.22 లక్షలతో నర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో రూ.6కోట్ల 80లక్షలతో 55 కిలో మీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 5,592 నల్లా కలెక్షన్లను అం దించామన్నారు. ప్రతిరోజూ పట్టణానికి 22 లక్షల 52వేల నీళ్లు సరఫరా అవుతున్నాయన్నారు. మిగతా చోట్ల పెండిం గ్లో ఉన్నటువంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చే యాలని ఈఈ రంగారావును ఆదేశించామన్నారు. కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించినప్పుడే అభివృద్ధి సాధ్యమవు తున్నదన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ రంగారావు, డీఈ మద్దిలేటి, కమిషనర్ మల్లికార్జున స్వామి, ఏఈఈ నాగశివ, వైస్‌చైర్‌పర్సన్ అఖిల, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.