భూత్పూర్, అక్టోబర్ 26 : కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చి మున్సిపాలిటీ పరిధిలో నల్లా బిల్లులు లేకుండా నీళ్లను సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి నల్లా బిల్లులను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నదని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ విమర్శించారు. శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావే శం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. న ల్లాబిల్లులు వసూలు చేయకూడదని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా ఇంటి ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. ఇంటి పన్నును తగ్గించాలని తీర్మానం చేశారు. సమావేశంలో మేనేజర్ శంకర్‌నాయక్, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు బాలకోటి, రామకృష్ణ, గడ్డం నా గమ్మ, కృష్ణవేణి, ఫాతిమాబేగం, కో ఆప్షన్ సభ్యులు అజీజ్, మల్లమ్మ, జాకీర్, ఏఈ పుష్ప, అకౌంటెంట్ ఇందిర, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.