సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, తెలంగాణలోని ప్రతి జిల్లాను రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు.
- రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ
- హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
- మన పోలీసులే నెంబర్‌వన్ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్‌నగర్‌లో ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపన
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 9 : సీఎం కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, తెలంగాణలోని ప్రతి జిల్లాను రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రూ.39 లక్షలతో నిర్మించనున్న జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులకు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసిఆర్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన సమయంలో మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ సరైన రోడ్లు లేకుండే, పరిస్థితులు దారుణంగా ఉండేవని, ఇప్పుడు మహబూబ్‌నగర్‌ను చూస్తుంటే హైదరాబాద్ తర్వాత మహబూబ్‌నగర్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంతో కష్టపడి మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాలమూరు వెనుకబడిన ప్రాంతం అని సీఎం కేసీఆర్ పదేపదే బాధపడేవారని తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నదని దేశంలో నెంబర్ వన్ పోలీసు అంటే తెలంగాణ పోలీసు అనే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా ఉండేవికాని, ప్రత్యేక రాష్ట్రం తరువాత సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్, మహిళల రక్షణ కోసం షీ టీమ్ ఏర్పాటు చేయడంతోపాటు ఫ్రెండ్లీ పోలిసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఒకే రోజు హిందువుల గణేశ్ శోభాయాత్ర, ముస్లింల మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించినా ఒక్క చోట కూడా ఘర్షణ వాతావరణం లేకుండా సాఫీగా సాగాయంటే అది మన తెలంగాణ పోలీసుల సమిష్టి కృషియేనని వివరించారు. ముఖ్యంగా మహిళలకు పోలీస్ శాఖలో 30 శాతం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం దేశంలో మనదే అ న్నారు. పాత జిల్లాలో కూడా ఎస్పీ కార్యాలయల ను ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా మహబూబ్‌నగర్‌లో రూ.39 లక్షలతో నూతన ఎస్పీ కార్యాలయం నిర్మాణాన్ని చేపడతున్నామ ని, ఏడాదిలోగా అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
మన పోలీసే దేశంలో నెంబర్ వన్
తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్‌వన్ స్థానం లో ఉన్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజల ఆలోచనలనకు అనుగుణంగా పాత పోలీసు కార్యాల యం స్థానంలోనే కొత్త పోలీసు నూతన భనవా న్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయం పట్టణం నడ్డిబోడ్డున అందరికీ ఉపయెగకరంగా అన్ని సౌకర్యాలతో దగ్గరగా ఉం టుందన్నారు. డీఐజీ కార్యాలయం సైతం మహబూబ్‌నగర్‌లోనే ఉంటుందని చెప్పారు. ప్రెండ్లీ పోలీసు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న ఆభూత కథనాలు కల్పనలపై ఉక్కు పాదం మో పాలని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులకు సూ చించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ సీఎంగా కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి శాఖకు నూతన హంగులు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్, గ్రంథాలయాల సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, ము న్సిపల్ చైర్మన నర్సిములు, డీసీసీబీ ఇన్చార్జి చైర్మ న్ వెంకటయ్య, పోలీసు అధికారులు ఉన్నారు.
ఊహించనంత అభివృద్ధి
నాటికి నేటికీ ఎవరూ ఊహించనంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. సో మవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మహబూబ్‌నగర్ ముఖచిత్రం’ పుస్తకావిష్కరణను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేండ్లలో జిల్లాలో ఎంతో అ భివృద్ధి జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధి ప్రతి ఒక్కరికీ తెలిసే విధంగా పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన అనంతరం మహబూబ్‌నగర్‌ను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సమస్యలను అధిగమించి అభివృద్ధి చేసుకున్నామన్నారు. మ హబూబ్‌నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, మున్ముందు మరింత అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

