నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని, రూ.50వేల కో ట్లతో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని, ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ ల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్ జి ల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అంజనగిరి రిజర్వాయర్‌ను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నీ టిపారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రులు పరిశీలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం మీ డియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గతంలో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు దృఢసంకల్పంతో మంత్రుల బృందం అడుగులు వేస్తుందన్నా రు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పీఆర్ఎల్ఐ, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, గట్టు ప్రాజెక్టుల పురోగతిలో ఉన్న, పెండింగ్ పనులను నూటికి నూరు శా తం పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. సీఎం రేవం త్ సొంత జిల్లా పాలమూరులో సాగునీటి సమస్య లేకుం డా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉదండాపూర్‌లో భూసేకరణ పరిహారం ఆరేడు నెలల్లో ఇస్తామన్నారు.
నార్లాపూర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నా రు. కాల్వల టెండర్లను త్వరలో చేపడుతామని ప్రకటించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ సీఎం సొంత జిల్లా కావడంతో ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఎకరాకూ నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూసేకరణలో నిర్వాసితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తామన్నారు. రూ.50 వేల కోట్లతో జిల్లాలోని పెండిం గ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు.
ప్రతి రెండు నె లలకోసారి సమీక్షలు నిర్వహించి పాలమూరులోని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. వచ్చే మూడు, నాలుగేండ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమం లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎ మ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, విజయుడు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, అధికారులు ఉన్నారు.