మహబూబ్‌నగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వలసల జిల్లాలో ఎన్నో ఏం డ్ల కల సాకారమవుతున్నదని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహాగౌడ్, ఐటీ కారిడార్ జో నల్ కార్యదర్శి రవికుమార్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. శనివారం ఐటీ ఇండస్ట్రీయల్ శాఖ మంత్రి టీఆర్ ఐటీ, ఎనర్జిటిక్ పార్కును ప్రారంభిస్తారని మంత్రి చెప్పా రు. పామూరుకు ప్రాజెక్టులు వస్తున్నయ్, కరెంట్ వచ్చింది, పంటలు పండుతున్నా యి.. తాగు, సాగునీరు వచ్చింది.. కానీ జిల్లాకు చెందిన ఎంతోమంది పీజీలు, డిగ్రీ లు చేసి ఇతర దేశాలకు పోయి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. నాలుగేండ్ల కిందట ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసుకొని నేడు బ్రహ్మాండంగా ప్రారంభించుకోనున్నామన్నారు. ఎనిమిది ఐటీ కంపెనీలు ఇక్కడకు రాబోతున్నాయి..
వాళ్లతో ఎంఓ యూ కుదుర్చుకుంటున్నామన్నారు. ఇక్కడ అవకాశాలు లేక ఇతర దేశాల్లో కంపెనీ లు పెట్టిన ఈజిల్లాకు చెందిన వారు ఇక్కడికొచ్చి స్టార్టప్ కంపెనీలు పెట్టొచ్చని మంత్రి ఆహ్వానించారు. వచ్చే ఐదేండ్లలో దాదాపు 50వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. హైదరాబాద్ నుంచే కాక ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఇక్కడ పూర్తికాగానే భూత్పూర్-అన్నాసాగర్ మధ్య ఉన్న ప్రభుత్వ భూమిలోనూ పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటాం. మంత్రి వెంట జేపీఎన్సీఈ చైర్మన్ రవికుమార్, ఐటీ ఇండస్ట్రీస్ సంస్థల అధినేతలు ఉమాకాంత్, బీఆర్ఎస్ నేతలు కిశోర్, శరత్‌గౌడ్, సుదీప్‌రెడ్డి ఉన్నారు.