మహబూబ్నగర్అర్బన్/మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 14 : బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను నియోజకవర్గం ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గుండుమాల్ చంద్రశేఖర్‌చారి ఆధ్వర్యంలో జిల్లా స్వర్ణకారులు నర్సింహాచారి, కృష్ణకాంత్చారి, మురళీధరచారి, కృష్ణచారి, మరో వంద మంది చేరారు. అలాగే హన్వాడ మండలం తిరుమలగిరి గ్రామంలోని ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఎరుకలి సీనయ్య, వెంకటయ్య, శ్రీను, పద్మమ్మ, బాలమ్మలతోపాటు 50 మంది, మహబూబ్‌నగర్ రూరల్ మండలం లాల్యానాయక్తండాకు చెందిన ప్రతాప్‌నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్‌నాయక్, శంకర్‌నాయక్, రవినాయక్ సహా 50 మంది, షాసాబ్గుట్టకు చెందిన పిల్లి కుటుంబ సభ్యులు పిల్లి రవి, పిల్లి రమేశ్ సహా 30 మంది, కొత్తగంజికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేంద్రనాథ్, అధ్యక్షుడు నారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు రమేశ్చంద్ర, కుమారస్వామి, యాదగిరి, కృష్ణయ్య, నర్సింహయ్య, నర్సింహులు, విజయ్‌కుమార్, శ్రావణ్, తిరుపతయ్య, జయప్రకాశ్, రవీందర్, జనసేన పార్టీ యువజన నాయకుడు నర్సింహ అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా కార్యదర్శి కుమార్గౌడ్తోపాటు నాయకులు రఘు, మహేశ్, కన్నయ్య, వెంకటేశ్, విష్ణువర్ధన్‌గౌడ్, భరత్, నిఖిల్ మంగళవారం బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమెహన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో చేరా రు. మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగిన అభివృద్ధి చూసి అధికార పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
హన్వాడ, నవంబర్ 14 : గ్రామాల్లో చేసిన అభివృద్ధిని చూసి అధిక మెజార్టీతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను గెలిపించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారద అన్నారు. మంగళవారం మండలంలోని టంకర, గుడ్డిమాల్కాపూరం, రాంనాయక్ తండాలో ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలన్నారు. వీరి వెంట సర్పంచ్ మాగ్యనాయక్, నాయకులు శివకుమార్, ఆశన్న, వెంకటయ్య, శ్రీనివాసులు, మహిళలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 14 : పట్టణ కేంద్రంలోని 37వ వార్డు సద్దలగుండులో మంగళవారం శ్రీనివాస్‌గౌడ్ సతీమణి శారద, కూతుళ్లు శ్రీహిత, శ్రీహర్షిత, కుటుంబ సభ్యులు శ్రీదేవి, రాధిక ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, పట్టణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన అభివృద్ధిని వివరించారు. బీఆర్ఎస్పార్టీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మరో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్ సాయిలు, సర్పంచ్ జరీనాబేగం, నాయకులు వేణుగోపాల్, శేఖర్, షబ్బీర్, అజం, రాము, ప్రదీప్ పాల్గొన్నారు.