మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 20 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్హాల్లో గురువారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.128కోట్ల వ్యయంతో జిల్లాలో మైనార్టీ గురుకులాల సముదాయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మినీ హజ్‌హౌస్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే మరో రూ.50లక్షలతో షాదీఖానా నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 3,230మందికి షాదీముబారక్ చెక్కులు, 6వేల మందికి రంజాన్ కానుకలను అందించినట్లు తెలిపారు. రూ.5.33కోట్లతో ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు చెప్పారు.
2,379 మంది మైనార్టీ విద్యార్థులకు రూ.27.20కోట్ల ఉపకార వేతనాలను మంజూరు చేశామని, పోస్ట్‌మెట్రిక్ విద్యార్ధులకు ఏటా రూ.36.50లక్షలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు టీడీగుట్ట బీలాల్ మసీదు, ఏనుగొండలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో పాల్గొన్నారు. అలాగే వానగుట్ట రహెమానియా ఈద్గాను పరిశీలించారు. ఈద్ నమాజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, తఖీహుస్సేన్, హఫిజ్ ఇద్రీస్, నాయకులు మోసీన్‌ఖాన్, అన్వర్‌పాషా, మోసీన్ పాల్గొన్నారు.
అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
హన్వాడ, ఏప్రిల్ 20 : అన్నివర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్వాడ, కొత్తపేట గ్రామాల్లో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం రూ.10లక్షలతో నిర్మించిన ఈద్గా ప్రహరీని ప్రారంభించారు. అనంతరం హన్వా డ రైతువేదికలో 73మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యం లో 100మంది చెంచులకు దుప్పుట్లు, 15 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమం లో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌ డ్, కార్యదర్శి శివకుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, అన్వర్, కొండా లక్ష్మయ్య, జం బులయ్య, బసిరెడ్డి, సత్యం, శ్రీనివాసులు, రాఘవులు, హరిశ్చందర్, రమణారెడ్డి, సత్యం, చెన్నయ్య, యాద య్య, జహంగీర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 20 : విపత్తు సమయాల్లో అగ్నిమాపకశాఖ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అగ్నిమాపకశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జడ్చర్ల హైవేపై, మహబూబ్‌నగర్ పట్టణంలో ఫైర్స్టేషన్ల నిర్మాణానికి ఆవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి సుధాకర్, కౌన్సిలర్ మునీరుద్దీన్ పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 20 : జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, వారి సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో టీఎన్జీవోఎస్ నూతన భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం టీఎన్జీవో ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు. టీఎన్జీవోఎస్ భవనం అద్భుతంగా నిర్మించారని, మరో అంతస్తు నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
దుష్ప్రచారం తగదు..
దివిటిపల్లిలో నెలకొల్పనున్న లిథియం కంపెనీపై దుష్ర్పచారం చేయడం తగదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. కంపెనీతో ఎలాంటి కాలుష్యం ఉండదని, ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల వల్ల 30వేల ఉ ద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవినాయక్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్‌రెడ్డి, చందర్‌నాయక్, మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సిహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కేంద్ర టీఎన్జీవో సంఘం కోశాధికారి శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, జగదీశ్, కౌన్సిలర్ పుష్పావతి పాల్గొన్నారు.