తండాల్లో మౌలిక వసతులు
తండాల అభివృద్ధికి బీ ఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి మౌలిక వసతు లు కల్పించారన్నారు.
- జీపీలుగా మారాకే అభివృద్ధి పరుగులు
- ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, ఫిబ్రవరి 15 : తండాల అభివృద్ధికి బీ ఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి మౌలిక వసతు లు కల్పించారన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జి ల్లా కేంద్రంలోని అయ్యప్ప గుట్ట సమీపంలో ఉన్న స ద్గురు సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ఏర్పాటు చే సిన సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి హాజరై ప్ర త్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, స్వరాష్ట్రంలో జరిగిన ప్రగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు. పాలమూరు స్టేడియం సమీపంలో గిరిజన విద్యార్థుల వసతి గృహాన్ని కళాశాల చెంతనే నిర్మించి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. వర్కింగ్ ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటు చేశామన్నారు. రూ.1.50 కోట్లతో గిరిజన భవన్ నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో సేవాలాల్ జయంతిని జెడ్పీ వద్ద రోడ్డుపై నిర్వహించడడం చూసిన గిరిజన నాయకులకు అయ్యప్ప కొండ వద్ద గిరిజన భవన్ పక్కనే సేవాలాల్ ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చి.. స్థలం కేటాయించడంతోపా టు రూ.25 లక్షలు మంజూరు చేశామని గుర్తు చేశారు.
రాబోయే రోజుల్లో పేద గిరిజన జంటల సామూహిక వివాహాలు జరిపించేందుకు తనవంతు ఆర్థిక సాయం అందిస్తానన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాల వైఖరి సక్రమంగా లేదని దుయ్యబట్టారు. అనంతరం మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ఊరేగింపు లో మంత్రి భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో సే వాలాల్ ఆలయ కమిటీ చైర్మన్ చంద్రానాయక్, ప్రధాన కార్యదర్శి దేవుజానాయక్, కోశాధికారి గోపాల్‌నాయక్, గిరిజన సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజునాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, గ్రూప్-1 అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఛత్రునాయక్, డీఎస్డీవో నాయకుడు పాండు, కౌన్సిలర్లు మోతీలాల్, లక్ష్మణ్‌నాయక్, నాయకులు హతీరాంనాయక్, శేఖర్, దేవుజానాయక్, దశరథ్‌నాయక్, గంగారాంనాయక్, తానాజీ, హరిచందర్నాయక్, ఆనంద్‌నాయక్, రాములునాయక్, గోవర్ధన్‌నాయక్, రంగ, రవిరాథోడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణే తమ ధ్యేయం..
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 15 : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈద్గా, వక్ఫ్ రహమానియా, జామియా మ సీద్, జేపీఐటీసీ, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులతో ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నాలుగు కమిటీలు ఇచ్చే ప్రతిపాదనల మేరకు ఏ ప్రిల్‌లో కార్యాచరణ ఉంటుందన్నారు. స్థానిక కమిటీ లో ప్రాతినిధ్యం లభించని వారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశం లో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, మైనార్టీ నాయకులు అన్వర్‌పాషా, ఇక్బాల్, హనీఫ్, వాహెద్తాజ్, మక్బూల్, అన్వర్, మేరాజ్, సమాద్ఖాన్, జావిద్‌బేగ్, పాషా, రషీద్‌ఖాన్, గౌస్, నిరంజన్, సజ్జు, హకీం, షబ్బీర్, తఖీ, నూరుల్‌హసన్, హఫీజ్ఇద్రీస్, మోసిన్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

