దళితుల అభ్యున్నతికి కృషి
దళితుల అభ్యు న్నతికి బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు, కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని బాబాసాహెబ్ విగ్రహావిష్కరణకు తరలివెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
- దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాల అమలు
- ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు
- ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- బాబాసాహెబ్ విగ్రహానికి నివాళి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14 : దళితుల అభ్యు న్నతికి బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు, కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్‌లోని బాబాసాహెబ్ విగ్రహావిష్కరణకు తరలివెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అదే బస్సు లో హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే రాష్ట్రం ఏర్పడిందన్నా రు. అణగారిన వర్గాల వారు బాగుపడేందుకు రిజర్వేషన్లు అవసరమని భావించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో అక్కడక్కడా దళితులపై చిన్న చూపు చూస్తున్నారని, సమాజంలో కుల వివక్ష రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ప్ర పంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడమే కాకుండా సచివాలయానికి బీఆర్ పేరు పె ట్టామన్నారు.
పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల కోసం గురుకులాలు, దళితబంధు అ మలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా గురుకులాలు, దళితబంధు, ఆత్మగౌరవ భవనా లు రావాలని.., ఇదంతా కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. దివిటిపల్లి సమీపంలోని ఐటీ కారిడార్‌లో పెద్ద పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, ముడా చైర్మన్ వెంకన్న, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ పాండు, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, రా మాంజనేయులు, కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, దళితులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

