ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు విస్తృతంగా సాగుతున్నాయి. సమావేశాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో గులాబీ జోష్ నెలకొన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలకు పూలు చల్లుతూ.. పటాకులు కాల్చుతూ పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినదిస్తున్నారు. బుధవారం పలు చోట్ల నిర్వహించిన సమావేశాలకు ఆదరణ లభించింది. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. పదరలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పెంట్లవెల్లిలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఊట్కూరులో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కల్వకుర్తి మండలం వేపూర్‌లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆయా వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని కోరారు.
మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 29 : గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యం అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మహబూబ్‌నగర్ రూర ల్ మండలంలోని ముఖ్య కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల్లో జ రిగిన అభివృద్ధిని చూసి దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు. ఉమ్మడి పాలనలో గ్రామాలు చాలా వెనకబడిపోయాయని, బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెల ముఖచిత్రాలు మారిపోయాయన్నారు. గ్రామంలో ఎటు చూసినా సీసీ రోడ్లు, తాగునీరు, వి ద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులు క ల్పించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి ప్రతి గుం టకూ తాగునీరందిస్తామన్నారు. రూరల్ మండలంలో కొత్తగా ఏర్పడిన ఆరు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. దీంతో నేడు గ్రా మాల్లో కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయన్నారు. అపదలో ఉన్న ప్రతి వ్యక్తిని ఎంపీటీసీ, సర్పంచులు తక్షణమే ఆదుకోవాలన్నారు. మన్యంకొండ ఆలయం వద్ద మెయిన్ రోడ్డుకు కుడి వైపు నుంచి కొండపైకి కిలోమీటర్ మేర రోప్ వే నిర్మిస్తామని, దీంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. ఆలయంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో లిథియం గిగా పరిశ్రమలు రావడంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన లిథియం పరిశ్రమపై కాలుష్యం పేరిట దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మహిళలతో త్వరలోనే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల సహకారంతో భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మరిం త సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పూర్తయితే క్యాన్సర్, హృద్రోగ, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు స్థానికంగా వైద్యం అందనుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాలతో పోలిస్తే పాలమూరు నెంబర్‌వన్ స్థానంలో ఉందని, ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధాశ్రీ, సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అనిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అల్లాఉద్దీన్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, గొర్రెల కాపరుల సంఘం మండలాధ్యక్షుడు శాంతన్నయాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.