మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 12 : మహబూబ్‌నగర్ అభివృద్ధిని చూ సి ఓర్వలేని కుట్రదారులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖ ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని 22వ వార్డుకు చెంది న బీజేపీ పట్టణ అధ్యక్షుడు అద్దని శ్రీనివాసులు, వార్డు అధ్యక్షుడు కాటం కృష్ణ, ఆంజనేయులు, అజయ్, చంద్రకాంత్, శ్రీకాంత్, నవీన్, ప్రవీణ్, కిశోర్, అలీతోసహా సుమారు 50 మంది నాయకులు గురువారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ అంటేనే అభివృద్ధి అనేలా చేశామని, భవిష్యత్తు లో ఎవరూ ఊహించని స్థాయిలో మరిం త డెవలప్మెంట్ చేస్తామన్నారు.
సమై ఖ్య రాష్ట్రంలో తాగునీరు, కరెంటు సరఫ రా లేకపోవడంతో సర్పంచులు, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు గ్రామాలకు వెళ్లాలంటే భయపడే దుస్థితి ఉండేదన్నారు. ఇప్పు డు అలాంటి పరిస్థితులు లేవని, మౌలిక వసతులన్నీ సమకూర్చడంతో ప్రజలం తా సంతోషంగా ఉన్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా సస్యశామలంగా మారనున్నదన్నారు. గతంలో 14 లక్షల మంది ఉపాధి నిమిత్తం వలసలు వెళ్లేవారని, ఏ ఆపద వచ్చినా వైద్యం అందక హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి చికి త్స చేయించుకునేవారన్నారు. రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత వలసలకు ఫుల్స్టాప్ ప డిందని, స్థానికంగానే ప్రభుత్వ దవాఖా నల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందు తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎ స్ నాయకుడు మాల్యాద్రిరెడ్డి ఉన్నారు.
ఆర్థరైటిస్‌పై అవగాహన కల్పించాలి..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 12 : గతంలో 50, 60 ఏండ్ల వయస్సు వారిలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35, 45 ఏండ్లలోనే చూస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆడిటోరియం లో ప్రపంచ ఆర్థరైటిస్ డేలో మంత్రి పా ల్గొని మాట్లాడారు. మోకాళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వై ద్యులు ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి ఆహారం, మందు లు తీసుకువాలో వివరించాలన్నారు. అ త్యాధునిక వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారాలని పిలుపునిచ్చారు. ఎస్వీఎస్ లో వివిధ వైద్య అంశాలపై పరిశోధనలు జరగాలన్నారు. ఇక్కడికే దేశ విదేశాల నుంచి వైద్యులు వచ్చేలా చూడాలన్నా రు. మహబూబ్‌నగర్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చామని, వివిధ పరిశ్రమలు, సంస్థలు తరలివచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
దివిటిపల్లి ఐటీ కం ఎనర్జీ పార్కులో ప్రఖ్యాత అమరరాజా లిథియం పరిశ్రమ ద్వారా 10 వేల మం దికి ఉద్యోగావకాశాలు రానున్నాయన్నా రు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో ఏ ర్పాటు చేసిన జంగల్ సఫారీ పట్టణానికి మణిహారంగా మారనున్నదన్నారు. కా ర్యక్రమంలో ఎస్వీఎస్ ఎడ్యుకేషనల్ సొ సైటీ ఎండీ డాక్టర్ కేజీ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ వెంకట్‌రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాంరెడ్డి, ఆర్థోహెచ్వోడీ డాక్టర్ ఆంజనేయులు, ప్రిన్సిపల్ డాక్టర్ జోషి, ప్రొఫెసర్ డాక్టర్ జగదీశ్వర్ ఉన్నారు.