పాలమూరు, జూలై 25 : మహబూబ్‌నగర్ పట్టణం లో ధూపదీప నైవేద్య అర్చకుల కోసం ప్రత్యేకంగా అర్చకభవన్ను నిర్మిస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సా యిబాబా మందిరంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ధూపదీప అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుడికి, భక్తుడికి అనుసంధానమైన అర్చకుల పరిస్థితి సమైక్య రాష్ట్రంలో ఎంతో ఇబ్బందిగా ఉండేదన్నారు. కనీసం భగవంతుడి సేవ కోసం అవసరమైన సామగ్రి కూడా లేక అవస్థలు పడేవారన్నారు. రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత వారి కష్టాలన్నీ తీరిపోయాయన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 1,600 మంది అర్చకులు మాత్రమే ఉండగా.. నేడు 6,500 మంది ఉన్నారన్నారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఎంతో చి త్తశుద్ధి ఉందన్నారు. నిత్యం దేవుడి పేరు జపం చేసే పార్టీలు చేసిందేమీ లేదని, సీఎం కేసీఆర్ మాత్రం యా దాద్రిని అత్యద్భుతంగా పునర్నిర్మించారన్నారు. రాష్ర్టా న్ని మరింత అభివృద్ధి చేయడంలో అర్చకులు, పూజారులు తమ వంతు పాత్ర వహించాలని కోరారు. అనంతరం మంత్రిని అర్చకులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చై ర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వా సుదేవశర్మ, రాష్ట్ర కన్వీనర్ గోపీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వీరన్న, కార్యదర్శి రవి, కోశాధికారి మహేశ్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఆర్ఐ వీణావాణి, జైపాల్‌రెడ్డి, రామలింగం, కుమారస్వామి ఉన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి..
పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ బా గుండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆకాంక్షించారు. మ హబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో నిర్వహించిన బోనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే ఏడాది బోనాల పండుగకు పాలకొండ చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నరేందర్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
అన్ని రకాల రోగాలకు వైద్య సేవలు..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 25 : అన్ని రకాల రోగాలకు మహబూబ్‌నగర్‌లోనే వైద్య సేవలందిస్తున్న ట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని వైద్య కళాశాలలు తెలంగాణలో ఉన్నాయన్నారు. టీ-హబ్ ద్వారా 134 రకాల పరీక్షలను ఉచితంగా చేయడమే కా కుండా గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయన్నా రు. గతంలో ప్రభుత్వ దవాఖానలో కేవ లం 15 మంది డాక్టర్లే ఉండగా.. ప్రస్తుతం 130 నుంచి 140 మందిని నియమించామన్నారు. ఇటీవల రేడియాలజీ హబ్ ప్రారంభించామని, కార్డియాలజీ పోస్టు మంజూరైనందునా శాశ్వత డాక్టర్ల నియమానికి కృషి చేస్తున్నామన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానలో నూతన ఎంఆర్ఐ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నిమ్స్ మాజీ డైరెక్టర్ డి.ప్రసాద్‌రావు సహకారంతో దవాఖానలో ప్రతి మంగళవారం ఒక గుండె వైద్య నిపుణుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ రవినాయక్, ముడా చైర్మన్ వెంకన్న, దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ ఆర్ఎంవో జీవన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, డీఎంహెచ్‌వో కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో భాస్కర్, గుండె వైద్య నిపుణుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 25 : అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, నిత్యం అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో టీడీగుట్టకు చెందిన బీజేపీ ఓబీసీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కొత్త వెంకటేశ్, పురుషోత్తం, అరుణతోపాటు 50 మంది.., హన్వాడ మం డలం వేపూర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు కాంగ్రెస్‌కు చెందిన 100 మంది కార్యకర్తలు మంగళవా రం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు తాగునీరు కూ డా సక్రమంగా ఇవ్వని నాయకులు.. ఇప్పుడు ఓట్ల కో సం గ్రామాల్లోకి వస్తున్నారని, వారితో అప్రమతంగా ఉండాలన్నారు. అనంతరం తొమ్మిది మందికి రూ. 5,37,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేశవులు, బీఆర్ఎస్ హన్వాడ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
జాబ్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి..
కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద రూ.5 లక్షలతో నిర్మించనున్న ప్లంబర్ అసోసియేషన్ వర్కర్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి భవన కార్మికుడు జాబ్ కార్డుకు దరఖాసు చేసుకోవాలన్నారు. కార్మికుల కోసం త్వరలోనే ఈఎస్ఐ దవాఖాన నిర్మిస్తామమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాణి, ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం, సభ్యులు ముఖ్తర్ ఖాన్, నజీర్ పాల్గొన్నారు.