మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 21: సార్ ఆధార్ కార్డ్ ఇప్పించండి.. అంటూ జి ల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఒక బాలుడు వేడుకున్నాడు. రోజువారీగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు మంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి శుక్రవారం వచ్చారు. ఈక్రమంలో దుర్గాప్రసాద్ అనే 11 ఏండ్ల బాలుడు ఒంటరిగా వచ్చి మంత్రిని కలిసి త నకు ఆధార్‌కార్డు ఇవ్వమని.. అది లేనందుకే తనను బడిలో చేర్చుకోవడం లేదన్నా డు.
తనకు చదువుకోవాలని ఉందని వేడుకోగా బాలుడి తపనను గుర్తించిన మంత్రి వెంటనే ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పెయింటర్ వృత్తి చేస్తున్న బాలుడి తండ్రి సతీశ్‌ను క్యాంపు కార్యాలయానికి రప్పించి దుర్గాప్రసాద్‌ను హాస్టల్లో చేర్పించారు. ఏ చిన్న సమస్య లే కుండా చూస్తానని.. దుర్గాప్రసాద్ బాగా చదివి డాక్టర్ లేదా ఇంజినీర్ అయ్యే వరకు అండగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు. మంత్రి వద్దకు ఎవరు వచ్చినా సమస్యలు తీరుతాయనేందుకు ఇదో ఉదాహరణ అని పలువురు అంటున్నారు.