గోపాల్పేట, మే 21 : సీఎం కేసీఆర్ పాలనలో పార్టీలకతీతంగా ప్రతిగడపకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఏదుట్లకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 200 మంది ఆదివారం గ్రామంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, చేపట్టిన అభివృద్ధిని చూసి దేశవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ పరిపాలన కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తెలంగాణ సర్కారు ఎజెండా అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సాగునీటి రాకతో ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి ఉపాధి దొరికిందన్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి మార్పు మొదలు కానుందన్నారు.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు..
ఏదుట్లలో రూ.2కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని, మత్స్యకారుల కోసం చేపల మార్కెట్‌కు రూ.10లక్షలు, వాల్మీకి కమ్యూనిటీ భవనం కోసం రూ.5లక్షలు, లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ మండపానికి రూ.5లక్షలు, అసంపూర్తిగా ఉన్న శాలివాహన భవనం పూర్తి చేసేందుకు రూ.3లక్షలు, ఊర చెరువు అలుగు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.5లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. డ్రైనేజీ నిర్మాణం, చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి హెల్త్ సబ్‌సెంటర్ వరకు సీసీ, డ్రైనేజీ తో కూడిన ఫుట్‌పాత్ నిర్మాణం చేయించాలని గ్రామస్తులు కోరారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణపై హర్షం వ్యక్తం చేస్తూ వీఆర్ఏ జేఏసీ నాయకులు మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంద భార్గవి, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీలత, ఉపసర్పంచ్ క్రాంతిరావు, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ మతీన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, గ్రామ అధ్యక్షుడు శ్రీధర్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, గ్రామ అధ్యక్షుడు ధర్మయ్య, యూత్ అధ్యక్షుడు రాజేష్ ఆచారి, నాయకులు సురేష్, నీలంబర్ రావు, కోటీశ్వర్‌రెడ్డి, స్వామిరెడ్డి, యాదగిరి, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
మినీ ట్యాంక్‌బండ్ పనులు వేగవంతం చేయాలి..
వనపర్తి, మే 21 : జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో జరుగుతున్న మినీ ట్యాంక్‌బండ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద చేపడుతున్న సీసీ రహదారి నిర్మాణం, మర్రికుంట మినీ ట్యాంక్ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ రక్షితా కె.మూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.