వనపర్తి, సెప్టెంబర్ 28 : తొమ్మిదేండ్లల్లో పక్క ప్రణాళికాప్రకారం చరిత్రలో నిలిచిపోయే పనులను చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో మంత్రి కేటీఆర్ పర్యటన, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై గురువారం మంత్రి నిరంజన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చూడలేని, ఇష్టంలేని నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటిని జర్నలిస్టులు గమనించాలన్నారు.
ఎక్కడ కూడా మంజూరు లేకుండా పనులను చేపట్టలేదన్నారు. వనపర్తి జిల్లా ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి కొరత ఉండకూడదన్న ఆ లోచనతో రూ.425 కోట్లతో మిషన్ భగీరథ పనులు చే పట్టామన్నారు. తెలంగాణ గడ్డపై పారే ప్రతి నీటి బొ ట్టును వినియోగించుకునే ప్రయత్నంతో అవసరం ఉన్న చోట సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ వనపర్తి జిల్లా లో పర్యటించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే యనున్నట్లు తెలిపారు. డిప్ సిస్టం ద్వారా ఎంపికై రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు, నిరుపేదలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామన్నారు.
వీటిలో రాజపేట శివారులో 96, పీర్లగుట్టలో నిర్మించిన 294 డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయన్నారు. వీధి వ్యాపారస్తులు ఒకే చోట వ్యాపారం చేసుకునేలా అన్ని రకాల వసతులతో సమీకృత మార్కెట్ నిర్మించామన్నారు. బ్యాంక్, బంకెట్హాల్, సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకునేలా దుకాణాలు ఉన్నాయన్నారు. సిద్దిపేట, సూర్యాపేట, గజ్వేల్ సరసన వనపర్తి మార్కెట్ చేరుతుందన్నా రు. బంకెట్హాల్ నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తులు ముందుకొస్తే అవకాశం కల్పిస్తామని, ఎవరూ రాకుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామన్నారు. వనపర్తిలో సాహితీవేత్తలు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా సురవరం సా హితీ సౌరభం పేరిట రూ.5.75 కోట్లతో టౌన్‌హాల్ ని ర్మించుకున్నామన్నారు.
రూ.22 కోట్లతో రాజభవనం పునరుద్ధరణ, శిథిలమవుతున్న పాలిటెక్నిక్ హాస్టల్ మరమ్మతులు, మరో రెండు హాస్టళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.76 కోట్లతో బైపాస్ రహదారి, రూ.48 కోట్లతో వనపర్తి-పెబ్బేరు రోడ్డు ని ర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. జిల్లాలోని సంకిరెడ్డిపల్లె శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. మొదటి దశలో రూ. 300 కోట్లతో కంపెనీ ఏర్పాటు చేయనున్నారని, దీని ద్వారా సుమారు 500 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఏదుల రిజర్వాయర్ కడుతుంటే ఎగతాళి చేశారని, రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి నవ్విన వా ళ్లే ఆశ్చర్యపోయేలా నిర్మించామన్నారు.
నియోజకవర్గం లో సుమారు అన్ని గ్రామాలకు సాగునీరు పారుతుంద ని, రెండు, మూడు ఎతైన ప్రాంతాలు మాత్రమే మిగిలిపోయాయన్నారు. వాటికి సాగునీరిచ్చేలా రూపొందించిన కాశీంనగర్‌లో రామన్నగుట్ట రిజ్వరాయర్ ఫైల్ సీ ఎం వద్ద ఉందని, త్వరలోనే మంజూరు చేయిస్తామన్నా రు. జిల్లాకు రూ.10 కోట్లతో ఐటీహబ్‌ను తీసుకొచ్చామన్నారు. రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, అలాగే మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా వస్తున్నారన్నారు. బహిరంగ సభకు ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. అనంతరం వనపర్తి ప్రగతి ప్రస్థానం బుక్కును మంత్రి విడుదల చేశారు. సమావేశంలో ము న్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తియాదవ్ ఉన్నారు.
ఎంఎస్ స్వామినాథన్.. అన్నదాతల ఆత్మబంధువు
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 28 : అన్నదాతల ఆత్మబంధువు ఎంఎస్ స్వామినాథన్ అని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయ శాస్త్రవేత్త నా ర్మన్ బోర్లాంగ్తో కలిసి స్వామినాథన్ పనిచేశారన్నా రు. ఇటీవలే స్వామినాథన్‌ను కలిశానని ప్రేమగా, ఆసక్తిగా మాట్లాడారని, నేను కలలు కన్న విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరోగ్యం సహకరిస్తే ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారన్నారు. దేశంలోని రైతాంగానికి ఆయన మరణం పెద్ద విషాదమని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సమాన స్థాయిలోని వ రల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయుడని కొనియాడారు. హరితవిప్లవ పితామహుడు అని అన్నారు.