వనపర్తి, సెప్టెంబర్ 28 : వనపర్తికి శుక్రవారం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ వేర్వేరుగా పరిశీలించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించవద్దని ఆధికారులను ఆదేశించారు. 50వేల చిలుకు ప్రజలు రానున్నరని, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన గ్రంథాలయ భవనాన్ని సందర్శించారు. అలాగే కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ తిరుపతిరావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం మంత్రితో క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ గట్టుయాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య పాల్గొన్నారు.
హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి
కొత్తకోట, సెప్టెంబర్ 28 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిపాడ్ స్థలాన్ని కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రా మ శివారులో ఏర్పాటు చేశారు. అట్టి స్థలాన్ని గురువారం రాత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆ ల వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీడీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జి ల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, నాయకులు భీంరెడ్డి, జగన్, మహేశ్, వికాస్, కిరణ్, రాజునాయక్, చింటు తదితరులున్నారు.