కొల్లాపూర్, జూలై 18 : కాంగ్రెస్ పార్టీ కర్షకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ఎక్సై జ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రుణమాఫీ విడుదల సందర్భంగా మం డలంలోని రామాపురం రైతువేదిక వద్ద రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సంబురాల్లో పాల్గొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి మొదటి విడుత రుణమాఫీ విడుదల చేయగానే ఎద్దుల బండిపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం రూ.2లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడుతగా రూ. లక్షలోపు మాఫీ చేసినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, గృహజ్యోతి పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అధికారులు పాల్గొన్నారు.