ధరూరు, ఆగస్టు 17 : ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల ఫేజ్-2 ర్యాలంపాడు రిజర్వాయర్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి సరితతో కలిసి శనివారం సందర్శించారు.
రిజర్వాయర్ నీటిమట్టాన్ని పరిశీలించి నీటి విడుదల, ఆయకట్టు, లీకేజీ విషయమై ఈడీ రహీమొద్దీన్ను అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపత య్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీనివాసులు, వెంకట్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, రవి, మధుసూదన్‌బాబు, రాజశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, దౌలన్న తదితరులున్నారు.