మాగనూరు : వంట కార్మికులకు ( Cooking Workers ) కనీస వేతనం రూ. 26 వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ ( CITU) జిల్లా ఉపాధ్యక్షులు పుంజనూరు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాలలో మండల విద్యాధికారులు మురళీధర్ రెడ్డి, నిజాముద్దీన్‌కు సార్వత్రిక సమ్మె నోటీసును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 9న జాతీయసమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు . కార్మికులకు నష్టం కలిగించే కార్మిక కోడ్లను రద్దు చేయాలని, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను పాలకులు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు మైముదా, లింగమ్మ, సమిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.