మాగనూర్, నవంబర్ 20 : మండల కేంద్రంలో ని హైసూల్లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజ న్ అయి వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు వెం టనే స్థానిక ప్రభుత్వ దవాఖాన డాక్టర్‌ను పాఠశాల కు పిలిపించుకున్నా రు. 15 మంది విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించి, అందరినీ మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు.
అక్కడి నుంచి 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు తీసుకెళ్లారు. పెద్దమొత్తంలో విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌కు గురైతే ఉ పాధ్యాయులు బెదిరించి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ ద వాఖానల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డీఈవో అబ్దుల్ గనీ మాగనూర్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజన్ జరగడం కొత్తేమీ కాదని ఇది మూడోసారి అని విద్యార్థి సంఘాల నాయకులు డీఈవోతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థి సంఘాల నా యకులు ఆరోపించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వంట ఏజెన్సీ సిబ్బందిని తక్షణమే మార్చాలని డీఈవోతో డిమాండ్ చేశారు. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాటికి శ్రీహరి మక్త ల్ ప్రభుత్వ దవాఖాన, మాగనూర్ హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యపై అక్కడున్న ఉపాధ్యాయులను ఎంఈవోను వివరా లు అడిగి తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రతగా మహబూబ్‌నగర్ దవాఖానకు దాదాపు 15 మంది ని తరలించారు. తరలించిన వారిలో నందిని, శివ, ప్రియాంక, అనిల్, అంజలి, మహేందర్, ప్రశాంతి, రాకేశ్, నవ్య, భీమ్ శంకర్, జగదీశ్, విజయ్‌కుమార్, శివసాయి, మహేశ్, మధు ఉన్నట్లు డాక్టర్ అర్పోజ్ పాషా తెలిపారు.