మహబూబ్‌నగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. ఇక పార్లమెంట్ ఎన్నికల వంతు రానున్నది. త్వరలో ఎలక్షన్లు జరుగనుండడంతో రాజకీయ వేడి రగులుతున్నది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించిన గులాబీ దళం మరోసారి పాలమూరుపై జెండా ఎగురవేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు అధికార పార్టీపై వస్తున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నది.
ఇప్పటికే పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉందని, ఇదే స్ఫూర్తితో స్థానాన్ని కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థులపై చర్చ జరిగింది. ఈసారి కూడా పాలమూరు స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలని ఎంపీని కోరారు. మరోవైపు పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా ఇంకా స్థానిక సంస్థలపై బీఆర్ఎస్ పట్టు కొనసాగుతోంది. ఒక్క మహబూబ్‌నగర్ కోస్గి మున్సిపాలిటీ మినహా మిగతా 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్థానిక సంస్థల ప్రతినిధులు పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇదే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బలంగా మారుతుందని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు గుప్పించిం ది. అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి నెలన్నర అవుతున్నా ఒక్క ఫ్రీ బస్ తప్ప మిగతా హామీలేవీ నెరవేర్చలేదు. అన్నిటికీ 100 రోజుల డెడ్‌లైన్ అంటూ కాలయాపన చేస్తున్నది. యాసంగి సీజన్ దాటుతున్నా రైతులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రైతుబంధు పడలేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీపై ముఖ్యమంత్రి, మంత్రులు తలోతీరుగా మాట్లాడుతున్నారు.. కొత్త ఫీచర్ల ఊసే లేదు.. పాత పింఛన్ అందిస్తుండడంతో ప్ర జల్లో వ్యతిరేకత వస్తోంది. మరోవైపు రైతులకు కరెంట్ సంక్షేమం వెం టాడుతున్నది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నప్పటికీ ప్రకటించి రైతుల పంటలు ఎండిపోవడానికి ప్రభుత్వ పాలసీలు దోహదం చేస్తున్నాయి. ఒక్క వ రికి తప్ప మిగతా ఏ ఒక్క పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించ డం లేదు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందక క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అ య్యేవి కావని సామాన్య ప్రజలు అంటున్నారు. ప్రజా వ్యతిరేకత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడే అవకాశం ఉన్నదని దీన్ని బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలని అధిష్టానం ఆదేశాలు ఇ చ్చింది. దీంతో కిందిస్థాయి క్యాడర్‌ను పార్లమెంట్ ఎన్నికల కోసం స న్నద్ధం చేస్తున్నది. అన్ని నియోజకవర్గాల్లో పట్టు జారకుండా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఒకతాటిపైకి తీసుకొస్తున్నారు. కార్యకర్తల మనోబలం దెబ్బతినకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అధికార పా ర్టీని ప్రశ్నిస్తున్నారు. వంద రోజులు అయ్యాక హామీలు నెరవేర్చకపోతే భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ వ్యూ హాలు సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ సీటు విషయంలో బీజేపీలో చీలికలు రావడం అధికార కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలు కలిసి వస్తాయని గులాబీ పార్టీ భావిస్తున్నది. ఈసారి ఎలాగైనా సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని పాలమూరుపై గులాబీ గురి పెట్టింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 స్థానా ల్లో 12 స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ 85 శాతం ఉన్న స్థానిక కేడర్ ఇంకా గులాబీ పక్షానే ఉన్నది. అక్కడక్కడ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెడుతున్నా మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలు గు లాబీ జెండాకు అండగా నిలిచారు. అధికార పార్టీ స్థానిక నేతలను ప్రలోభాలకు గురిచేసి పార్టీని మా ర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను కొనుగో లు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎక్కడ కూడా సఫలీకృతం కావడం లేదు. ఒక్క మహబూబ్‌నగ ర్, కోస్గి మున్సిపల్ స్థానాలు మాత్రమే చేజిక్కించుకున్నారు. మిగతా చోట్ల ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక జెడ్పీ చైర్మన్లను తొలగించాలనే ప్ర యత్నం కూడా విఫలమవుతున్నది. ఆ యా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదు రుదెబ్బే తగులుతున్నది. స ర్పంచులు, ఎంపీపీలు, ఎం పీటీసీలు, జెడ్పీటీసీలను పె ద్ద ఎత్తున ప్రలోభాలకు గు రి చేస్తున్నా ఎవరూ లొంగ డం లేదు. స్థానిక సంస్థల క్యాడర్ కాంగ్రెస్ వైపు రాకపోవడంతో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభావం పడుతుందని అధికార పార్టీ లో గుబులు రేగుతున్నది.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. తె లంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. మొక్కవోని ధైర్యంతో 2014లో స్వరాష్ట్రం సాధించి పెట్టారు. పాలమూరు ఎంపీగానే ఈ ఘనత సాధించడంతో ఈ పార్లమెంటు స్థానం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నాంది పలికింది. ఆ తర్వాత 2014లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. 2018లో అభ్యర్థిని మార్చినప్పటికీ పాలమూరు ప్రజలు గులాబీ జెండా వెంటనే నిలిచారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్కు మహబూబ్‌నగర్ హ్యాట్రిక్ విజయాన్ని అందించి కేసీఆర్ సారథ్యంలో ఓ చిరస్మరణీయమైన కానుకను అందించింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లోనూ మహబూబ్‌నగర్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించుకో వాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశించారు. సిట్టిం గ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పా ర్టీ సర్వశక్తులా ప్రయత్నాలు ప్రారంభించింది.