ఆసుపత్రి అప్గ్రేట్
కేసీఆర్ ప్రభుత్వం ఏది అమ లు చేసినా అది భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధం గా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుతో ఏమొస్తదన్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి సొంత రాష్ట్రంలో అనేక సౌకర్యాలు, వసతులు ఏర్పడతాయని మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించిన వ్యక్తి కేసీఆర్.
- జిల్లా దవాఖాన స్థాయి పెంపు
- వంద పడకల నుంచి 300 పడకలకు అప్‌గ్రేడ్
- మెడికల్, నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు
- కేసీఆర్ సర్కారు ముందు చూపుతో ఆధునిక వైద్యం
- త్వరలో 300 పడకల దవాఖాన, కళాశాల భవనాలు ప్రారంభం
- నడిగడ్డ ప్రజలకు తీరనున్న వైద్య సమస్యలు
గద్వాల, జనవరి 28 : కేసీఆర్ ప్రభుత్వం ఏది అమ లు చేసినా అది భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధం గా ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుతో ఏమొస్తదన్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి సొంత రాష్ట్రంలో అనేక సౌకర్యాలు, వసతులు ఏర్పడతాయని మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నడిగడ్డలో వైద్యసేవలు అధ్వానంగా ఉండేవి. దవాఖానలో డాక్టర్లు ఉంటే మందులు ఉండవు.. మందులు ఉంటే డాక్టర్లు, రోగులు ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగి దవాఖానకు వస్తే ప్రాథమిక చికిత్స చేసి కర్నూల్ లేదా హైదరాబాద్‌కు తరలించే పరిస్థితి ఉండేది. అప్పటిలోగా ప్రాణాలు గాలిలో కలిసేపోయేవి. ఇక్కడ పేరుకు మాత్రమే వంద పడకల దవాఖాన, వైద్య సేవలు మాత్రం కేవలం ప్రాథమిక చికిత్సలకే పరిమితం. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొత్త జిల్లా లు ఏర్పాటు చేసి నడిగడ్డ వంటి వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అడుగులు వేశారు. ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉండడంతో విద్య, వైద్యపరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూ రు చేసింది. దీనికితోడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వంద పడకల దవాఖానను 300 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేశారు. అంతటితో ఆగకుం డా ఈ ప్రాంత ప్రజలకు వైద్యవిద్యను అందించాలనే సదుద్దేశంతో జిల్లాకు మెడికల్ కళాశాలను సైతం మం జూరు చేశారు. ముందు చూపుతో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ఫలాలు త్వరలో నడిగడ్డ ప్రజలు ఆస్వాదించబోతున్నారు.
నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో..
జోగుళాంబ గద్వాల జిల్లా వెనుకబడి ఉండడంతో విద్య, వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని గ ద్వాలకు నర్సింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరగా 2021లో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ప్రైవేట్ భవనంలో మూడో సంవత్సరం తరగతులు నడుస్తున్నాయి. ఈ కళాశాలకు సొంత భవనం నిర్మాణం కోసం కేసీఆర్ ప్ర భుత్వం రూ.27 కోట్లు కేటాయించగా ప్రస్తుతం ప నులు చివరి దశకు చేరుకున్నాయి. దీన్ని ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రారంభించడానికి ఇక్కడి అధికారులతోపాటు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సొంత భవనం సమకూరినట్లు అవుతుంది.
రూ.49కోట్లతో 300 పడకల దవాఖాన..
రోజురోజుకూ జనాభా పెరగడంతో జిల్లా కేంద్రంలో ఉన్న వంద పడకల దవాఖాన రోగులకు ఇబ్బందిగా మారుతుండంతో ఇది గ్రహించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బెడ్స్‌కు అదనంగా రెండు వందల పడకలకు పెంచుతూ అప్‌గ్రేడ్ చేసింది. రోగులకు సకల సౌకర్యాలు అందించాలనే లక్ష్యం వారికి ఆధునిక వైద్యం అందించాలనే ఆలోచనతో నూతనంగా 300 పడకల నిర్మాణాన్ని రూ.49కోట్లతో చేపట్టారు. వచ్చేనెలలో అది అందుబాటులోకి రానున్నది. దీంతో అక్కడ కార్పొరేట్ స్థాయిలో రోగులకు వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అది అందుబాటులోకి వస్తే ఎవరైనా ప్రమాదం జరిగి దవాఖానకు వస్తే ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలందించే అవకాశం ఉంటుంది.
మెడికల్ కళాశాల ప్రారంభానికి ఏర్పాట్లు..
కేసీఆర్ ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లాకు 16 సెప్టెంబర్ 2023న మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం రూ. 183 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మెడికల్ కళాశాలను 100 సీట్లతో ప్రస్తుతం నూతనంగా నిర్మించిన నర్సింగ్ కళాశాలలో ప్రారంభించడానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్‌తోపాటు సిబ్బందిని కేటాయించాలని గద్వాల ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు వినతిపత్రం ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్‌ను కేటాయించింది. దీంతో వైద్యపరంగా రోగులు, ప్రజలకు ఆధునిక వైద్యం అందించేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో వీటన్నింటినీ ప్రా రంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపుతో నర్సింగ్, మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తుండడంతో నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

