బల్మూరు, ఆగస్టు 21 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా ఎగురాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డితో కనీసం ఫొటోలు దిగడానికి కూడా ఆ పార్టీ కార్యకర్తలు ఇష్టడపడరని, అలాంటి పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశా రు. గురువారం మండలంలోని తుమ్మెన్‌పేట గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో బెదిరింపులకు, దౌర్జాన్యాలకు పాల్పడుతున్నా ఎవరూ అధైర్య పడొద్దని మీకు అండగా నేను ఉంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపు హామీలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి బీఆర్ఎస్ను గెలిపించేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.
అదేవిధంగా గతంలో పార్టీ వీడిన వారినంతా మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మనోహర్, కరుణాకర్‌రావు, వెంకటయ్య, నర్సింహాగౌడ్, తులసీరాం, కేటీ తిరుపతయ్య, పర్వతాలు, ప్రేమ్‌రావు, నాగయ్య, అశోక్‌రావు, శివశంకర్, వెంకటయ్య, నాగేశ్వర్రావు, సురేశ్, బాలరాజు, నాగరాజు, మహేశ్, రాములు, తిరుపతయ్య, సురేశ్రావు, సుదర్శన్‌రావు, హరిప్రాసాద్ తదితరులు ఉన్నారు.