నాగర్‌కర్నూల్, ఆగస్టు 20 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుండడాన్ని నిరసిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి 1500లకుపైగా లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని మహిళలు, ప్రజలు, తెలంగాణ అభిమానులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాన రహదారిపై గంటపాటు నిర్వహించారు.
డ్రామా ఆడుతున్న రేవంత్ సర్కార్ : మర్రి
ఉద్దేశపూర్వకంగానే కల్యాణలక్ష్మి పథకం కాకుండా చేస్తూ, ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది.. కాబట్టి ఆపే శామంటూ డ్రామాలు ఆడుతున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కానీ కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ పాతాళంలో బొందపెట్టిందన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ఆపాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇదేగాక స్థానిక ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు అయితేనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు వచ్చేందుకు సంతకాలు పెడుతున్నారని, బీఆర్ఎస్ వారని తెలిస్తే నిర్ధాక్షిణంగా పక్కన పెడుతున్నాడని విమర్శించారు.
గత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి చెక్కులు వస్తే అందరినీ పిలిపించి భోజనం పెట్టి చెక్కులు ఇచ్చి పంపించేవారమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైనప్ప టికీ తమ పార్టీ వారు కాదని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అమలు కానీ హామీలు ఇస్తే నమ్మిన ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గోస చూపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 16 లక్షల లెక్కలు చెబుతున్నారని, కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు.
కేసీఆర్ హయాంలో ఏకంగా 14 లక్షల 50 వేల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. జనాభా పెరిగినపుడు సహజంగానే పెళ్లిళ్ల సంఖ్య, దరఖాస్తులు పెరగాల్సి ఉన్నా కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. పథకాన్ని ఎలా నీరుగార్చారో చెప్పడానికి ప్రభుత్వ వైఖరి సాక్ష్యమన్నారు. కోర్టులో ఈ ప్రభుత్వం ఎంత ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలంగాణ సమా జం మొత్తం చూస్తోందన్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టులో 30 రోజుల సమయం ఇచ్చినా కావాలనే కౌంటర్ వేయకుండా వదిలేశారని, మీరు సమయానికి కౌంటర్ వేయకపోవడం వల్లే ఈ పథకంపై కోర్టు స్టే ఇచ్చిందని, ఇది ఆడబిడ్డల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో చేసిన కుట్ర కాదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. దీనిని బట్టి సీఎం రేవంత్‌రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుం దన్నారు. కల్యాణలక్ష్మి ఆగిపోతే పట్టించుకోని ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించి రోడ్లెక్కి పోరా టం చేసిన తర్వాతే ఉలిక్కిపడి కదిలిందన్నారు. సింగిల్ జడ్జి స్టే ఇచ్చిన వెంటనే డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటం దెబ్బకు భయపడి ఇప్పుడు హడావిడిగా అఫిడవిట్ వే స్తాం, అప్పీల్ చేస్తామని కొత్త నాటకాలకు తెరలేపారన్నారు. బీఆర్ఎస్ లేకపోతే పథకాన్ని ఎప్పుడో సమాధి చేసే వాళ్లన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కక్ష్య సాధింపు కోసం తప్పుడు కేసులు పెట్టి వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ్ లూధ్రాను ప్రత్యేకంగా తెచ్చుకున్నారన్నారు. ఆయనకు రోజుకు రూ.50 లక్షల ఫీజు చెల్లించడానికి సీఎం రేవంత్‌రెడ్డికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని, ఆ డబ్బు అంతా ప్రజలది కాదా అని ప్రశ్నించారు.
రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులకు రోజుకు రూ.50 లక్షలు కట్టే ప్రభుత్వానికి, లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల భవిష్యత్‌కు ముడిపడి ఉన్న కల్యాణలక్ష్మి కేసును వాదించడానికి ఒక మంచి లాయర్ దొరకలేదా.. లేక కావాలనే వదిలేశారా.. అంటూ ప్రశ్నించా రు. కేసీఆర్ పేదలపై ఉన్న చిత్తశుద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నార న్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాడు కేసీఆర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. కానీ నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ సంక్షే మ పథకాలను ఒక్కొక్కటిగా ఎలా ఎత్తి వేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి అప్పుడే మీ ముఖ్యమంత్రి దిగొస్తాడు కల్యాణలక్ష్మి కొనసాగిస్తాడని జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయకుండా కుట్ర రాజకీయాలు చేస్తే ఉద్యమిస్తామని మర్రి హెచ్చరించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తొలగించవద్దంటూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఆర్డీవో అర్చనకు అందజేశారు.

ప్రేమించే కందనూలు ప్రజలతోనే ఉంటా..
తాను నాగర్‌కర్నూల్‌ను వది వెళ్తున్నట్లు కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మవద్దన్నారు. తాను అమితంగా ప్రేమిం చే కందనూలు కుటుంబాన్ని కాదని మరెక్కడికి పోయేది లేదని, కొందరు స్వార్థపరులు అచ్చంపేటకు వెళ్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని, వాటిని న మ్మొద్దని మర్రి ప్రజలకు తెలియజెప్పారు. తాను నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పదేళ్లుగా శాసన సభ్యుడిగా ఉండి వెయ్యి మందికిపైగా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశానని గుర్తు చేశారు.
వచ్చే నవంబర్‌లో మరింత మంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. తాను రాజకీయాలకు సంబంధం లేకుండా నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సాకారాన్ని జీర్ణించుకోలేక కొందరు స్వార్థపరులు తాను వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉండనని, అచ్చంపేట ప్రాంతానికి పోతారని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక్కడే సేవ చేస్తా, ఇక్కడే ఉంటానని తేల్చి చెప్పారు. పట్టణ కూడలిలో ఒక షెడ్‌ను ఏ ర్పాటు చేసి నెలకు రూ.4 వేల అద్దె ఇస్తూ రూ.5తో పేద ప్రజలకు భోజనం పెడుతుంటే ఓర్వజాలక స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కుమ్మక్కై ఉచిత భోజనంపై నోటీసు ఇప్పించాడని మండిపడ్డారు. మీరు భోజనం పెట్టలేక ఇతరులను పెట్టనివ్వకుండా నోటీసులు ఇప్పించడం ఏమిటని ప్రశ్నించారు.
మర్రిని అడ్డుకున్న పోలీసులు
కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలంటూ చేపట్టిన ధర్నా అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవోకు ఇచ్చేందుకు వచ్చిన మర్రిని, బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వినతి ఇచ్చేందుకు వచ్చిన వారిని కా ర్యాలయం లోపలికి వెళ్లకుండా గేటు వేశారు. కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలంటూ నిబంధన పెట్టి అడ్డుకుంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో కార్యకర్తలు గేటును తోసుకొని లోపలికి వచ్చి ఆర్డీవోకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.