తిమ్మాజిపేట, మార్చి 29: నాగర్‌కర్నూ ల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సాగునీరు ఇవ్వగా సొంత మండలంలో ఇంకా ఇవ్వలేదని.. పాలమూరు ఎత్తిపోతలతో ఆగస్టు చివరి నాటికి వ ట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తి చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశా రు. తిమ్మాజిపేటలో ఒక రోజు ముందుగానే ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను బుధవారం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మరికల్, తిమ్మాజిపేట, గుమ్మకొండ గ్రా మాల్లో ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘ నంగా స్వాగతం పలికి కేక్ కట్ చేయిం చి గజమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం మండలకేంద్రంలో ఏ ర్పాటుచేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఆగస్టులో రెండు రిజర్వాయర్ల ను కృష్ణానీటితో నింపి రైతుల పాదాలు కడుగుతామన్నారు. మండలకేంద్రంలో రూ.4.5కోట్లతో రోడ్డు విస్తరణ చేపట్టి, డి వైడర్లు, బటర్‌ఫ్లై లైట్ల ఏర్పాటు పనులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప నిచేసే ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను గుర్తుంచుకోవాలని సూచించారు. కులా లు, మతాల మధ్య చిచ్చుపెట్టేవారిని తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, ఎం పీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు జోగు ప్రదీప్, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, హనుమంతుయాదవ్, సత్యంయాదవ్, ఎంపీటీసీలు కిల్లే మల్లయ్య, లీలావతి, రైతుబంధు కన్వీనర్ వెంకటస్వామి, మా ర్కెట్ డైరెక్టర్లు హుస్సేనీ, కవిత, విండో వైస్‌చైర్మన్ రాందేవ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మా జీ ఎంపీపీ జయలక్ష్మి, స్వామి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, మార్చి 29: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి 53వ జన్మదినోత్సవం సందర్భంగా తిమ్మాజిపేట, తెలకపల్లి, తా డూరు మండలాల్లోని 53మందికి పరీ క్షా మెటీరియల్ అందజేయనున్నారు. అ దేవిధంగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. శ్రీరామనవమి రోజునే ఎమ్మెల్యే పుట్టినరోజు రావడంతో గురువారం నాగర్‌కర్నూల్ బస్టాండ్ కూ డలిలో భారీ కేక్ కటింగ్‌తోపాటు ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 106మంది పేదలకు రూ.5 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయనున్నారు. పుట్టినరోజు వేడుకలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించేందుకు నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ డిపోకు వచ్చిన మూడు సూపర్‌లగ్జరీ బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.