నాగర్‌కర్నూల్, ఆగస్టు 5 : బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ బడేభాయ్గానూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ చొటేభాయ్గానూ… వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దేశంలోనే కాళేశ్వరం వంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని, అలాంటి ప్రాజెక్టును ఒక్క పిల్లర్ కుంగి తే అంతా కూలినట్లుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహాలను తొలిగించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా.. నాగర్‌కర్నూల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్కీన్ లో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. కల్వకుర్తి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మర్రి పా ల్గొన్నారు. అనంతరం మర్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని, బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రజలకు, రైతులకు వివరించాలన్నారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం నిర్మించి లక్షల ఎకరాలకు నీరందించి ఆయా ప్రాంతాల రైతుల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కాంగ్రెస్ కుట్రపూరితమైన విమర్శలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని చాలా ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలవరం మూడు సార్లు కూలితే ఒక్కసారి కూ డా ఎన్డీఎస్ఏ రిపోర్టు లేదు.. కానీ ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ కుంగితే ప్రా జెక్టు మొత్తాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. కుంగిన దానిని రిపేరు చేసే వెసలుబాటు ఉన్నా.. రాజకీయ లబ్ధికోసం.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాద్ధాంతం చేస్తూ అదేపనిగా ప్రా జెక్టు గురించి ముందరేసుకొని కూర్చుంటున్నారని విమర్శించారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఎందు కు మార్చారనే విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీశ్‌రావు క్షుణ్ణంగా వివరించారన్నారు. కాళేశ్వరంపై ఈ కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే మన కర్తవ్యమన్నారు.
అబద్ధం ప్రజల్లోకి ముందుపోయి.. నిజం నిలకడగా తెలిసినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కూడా ప్రజ లు త్వరలో అవగతం అవుతుందని మాజీ ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు నిర్మించి రైతుల పంట పొలాలకు సస్యశ్యామలంగా నీటిని అందిస్తే మేడిగడ్డ వద్ద ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టు మొత్తాన్ని బద్నాం చేయడం తగదని మండిపడ్డారు. ప్రాజెక్టు ఘటనను ముందరేసుకొని కేసీఆర్‌ను, పార్టీని ఇమేజ్ను దెబ్బతీసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాజీమంత్రి హరీశ్‌రావు వివరించిన విధంగా మనమంతా ప్రజలకు, రైతులకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు సహాయం చేశామేకానీ, హానీ చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఇచ్చిన ఆరు గ్యారెంటీలంటూ మాయమాటలు చెప్పి గెలుపొందిన ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు అం దరినీ కలుపుకొ ని బలమైన శక్తి ని ఎదిగి నాగర్‌కర్నూల్ జిల్లాను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ అంటే వ్యక్తికాదు శక్తి అని.. కేసీఆర్ అంటే సా ధారణ పౌరుడు కాదని, కారణజన్ముడని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. 14 ఏం డ్లు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, కేంద్రం మెడలు వంచి, తెలంగాణలోని సబ్బండ కులాలను ఏకం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ సా ధించిన మరో మహాత్ముడు కేసీఆర్ అన్నారు. మనం చేసిన అభివృద్ధికి సరైన ప్రచారం చేసుకోలేక గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యామన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ, 420 మోసాలు కానీ, 20 మాసాల్లో ఏం చేశారన్నది ప్రజల దృష్టికి తీసుకురావాలన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనిచేశారని, ఏ ఒక్క రైతు కూడా సాగు నీటికోసం ఇబ్బందులు పడకుండా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండి ఎందుకు ప్రాజెక్టులను కట్టలేకపోయిందని ప్రశ్నించారు. తెలంగాణను కోటి రతనాల వీణ చేయాలనే ఇద్దేశ్యంతో అభివృద్ధి చేశారన్నారు.