అచ్చంపేట, న వంబర్ 8 : మొంథా తుఫాన్ ధాటి కి అచ్చంపేట మండలం మార్లపాడుతండా గిరిజనులు సర్వం కోల్పోయారు. నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో భారీ వరదలు ముంచెత్తడంతో తండా మొత్తం నీటిలో మునిగిపోయింది. 250కిపైగా ఇండ్లు జ లదిగ్బంధమయ్యాయి. దీంతో గిరిజనులు కట్టుబట్టలతో బయటకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డా రు. పత్తి, వరి, ఆహారపదార్థాలు, వం టపాత్రలు, విద్యా సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్, భూమి పాసు పుస్తకాలు నీటిలో కొట్టుకుపోయాయి. పశువులు, మేకలు, కోళ్లు చనిపోయాయి.
సర్వం కోల్పోయి గిరిజనులు రోడ్డునపడ్డారు. వరదలు తగ్గుముఖం పట్టాక గ్రామంలోకి వచ్చిన గిరిజనులు తమ ఇండ్లను చూసి గుండెలు బాదుకున్నారు. కూలిన ఇండ్లు, నిత్యావసర సరుకులు చెల్లాచెదు రయ్యాయి. భూమి పాసుబుక్కులు, సర్టిఫికెట్లు, ఆహారధాన్యాలు, పంటలు కోల్పోయారు. అధికారులు వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి కలెక్టర్‌కు నివేదిక పంపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండాకు వెళ్లి గిరిజనులను పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అండగా నిలబడ్డారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వద్దకు వచ్చి మంపునకు గురైన తండాలో పరిస్థితులపై కనీసం ఆరా తీయలేదని, పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. తండాలో వరదకు 49మంది రైతులకు సంబంధించి 3,040 ఎకరాల పత్తి ముక్కిపోయిందని, 350 ఎకరాల్లో సాగు చేసిన పత్తిని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ ఉంచుకున్నారని మండల వ్యవసాయాధికారి కృష్ణయ్య తెలిపారు. ఇంట్లో ఉన్న పత్తి పంటను అంచనా వేయగా, 49మంది రైతులు దా దాపు 350 ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు.
దాదాపు రూ.25లక్షల విలువైన పత్తి పంట నష్టపోయినట్లు అంచనవేసి కలెక్టర్‌కు నివేదిక పంపించామని ఏవో తెలిపారు. నష్టపోయిన పత్తిని లెక్కలోకి తీసుకోలేదని, గిరిజనులు సాగుచేసిన భూములకు ప్రభుత్వం రిజర్వాయర్ కోసం తీసుకొని పరిహారం కూడా అం దించిందన్నారు. ఆ భూమిని సాగుచేసి పత్తిపంట వే శారని ఏవో తెలిపారు. అయితే ప్రభుత్వం రైతులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఇంట్లో నిల్వ ఉన్న పత్తి పంటనే అంచనా వేసి నివేదిక పంపించారు తప్పా వ్యవసాయ పొలాల్లో నీట మునిగిన పంట నష్టాన్ని పట్టించుకోలేదని వాపోయారు. ఇంత జరుగుతున్నా సర్కారు, సీఎం రేవంత్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వం కోల్పోయాం..
మొంథా తుఫాన్ మా తండా వాసుల్లో చీకట్లో నింపింది. కళ్లముందే మొత్తం వరదలో మునిగి పోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టు బట్టలతో వెళ్లిపోయాం. తినడానికి తిండి, తాగేం దుకు నీళ్లు లేవు. రైతుల ఇండ్లల్లో నిల్వ ఉన్న వందల క్వింటాళ్ల పత్తి తడిచింది. రెండ్రోజుల కిందట వరద తగ్గుముఖం పట్టాక తండాకు వస్తే ఇండ్లు, ఆవరణలు బురదతో నిండిపో యా యి. పశువులు, మేకలు చచ్చి ఉన్నాయి. కట్టుకునేందుకు బట్టల్లేవు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వ సాయం అందలేదు. సీఎం సమీపంలోకి వచ్చి వెళ్లినా తండాకు రాలేదు. సాయమైన ప్రకటిస్తారని అనుకున్నా కాలేదు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
– శ్రీకాంత్, మార్లపాడుతండా, అచ్చంపేట
ప్యాకేజీ ఇవ్వండి సారూ..
మా భూములు, తండాను త్యా గం చేసి నక్కలగండి రిజర్వా యర్ నిర్మిస్తున్నారు. 2004లో పనులు ప్రారంభమైనా నేటికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాలేదు. పునరావాసం కల్పిస్తే మా తిప్పలు మేము పో తాం. మా సమస్య పరిష్కారం అవుతలేదు. మా బాధ ఎవరికి చెప్పుకో వాలో తెలియడం లేదు. మొన్న తండా నీట మునిగింది. కట్టేందుకు బట్టలేదు, తిండిలేదు. రాత్రి వేళ వరదొచ్చి ఉంటే అందరం సచ్చిపోయేవాళ్లం.
– ముడావత్ మల్లేశ్,
పట్టించుకోకపోవడం బాధాకరం
గిరిజనులు సర్వంకోల్పోయి రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. కేవలం ఇంట్లో నిల్వ ఉన్న పత్తి పంటను మాత్రమే పరిగణలోకి తీసుకొని మునిగిన పంటలను వదిలేశారు. కలెక్టర్ స్పందించి సాగైన పంటల వివరాలను సర్వే చేసేలా చూడాలి. గతం లో వరదసాయం తక్షణమే ఇంటికి రూ.10 వేలు అందిం చారు. నల్లమల బిడ్డ అని చెప్పుకునే సీఎం గిరిజనులు ఆప త్కాలంలో ఉంటే ఎందుకు పట్టించుకోకుండా వెళ్లిపోయారో చెప్పాలి. వెంటనే ఆదుకోవాలి.
– మనోహర్, బీఆర్ఎస్ సీనియర్ నేత