వంగూరు, ఆగస్టు 1 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుండగా మరోపక్క అర్హులైన రైతులు రు ణమాఫీ అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వంగూరులోని ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో వివిధ గ్రామాలకు చెందిన 4,776 మంది రైతులు రూ.2లక్షల రుణమాఫీకి అర్హులు కాగా వారిలో మొదటి విడుతలో రూ.లక్ష రుణమాఫీ 1600 మందికి, రెండో విడుత రూ.1.50లక్షల రుణమాఫీ కేవలం 500 మంది రైతులకు మాత్రమే వర్తించింది.
మొదటి విడుత 1600 మంది రైతులకు ఫోన్ల ల్లో సమాచారం వచ్చినప్పటికీ ఖాతాలో జమ కాకపోవడంతో వారు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. మరో పక్క ప్రభుత్వం ఇచ్చిన కటాఫ్ డేట్లో రుణాలు పొందినప్పటికీ మాఫీకాక వారు వ్యవసాయ అధికారులు, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఆందోళన కు గురవుతున్నారు. మరి కొంతమంది రైతు ల ఆధార్ వేరే బ్యాంకులో రుణాలు పొందిన రైతుల ఖాతాలకు ఉండడంతో అసలు రైతు తీవ్రంగా నష్టపోతున్నారు.
2023 డిసెంబర్ తర్వాత రెన్యూవల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో వారూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో బుధవా రం వంగూరులోని ఐవోబీ బ్రాంచ్‌కు రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఏవో తనూజ బ్యాంక్ మేనేజర్ నాగరమేశ్తో కలిసి రైతుల వివరాలు పరిశీలించారు. ఏది ఏమైనా ప్రభు త్వం రుణమాఫీ అర్హులందరికీ వర్తింపజేయాలని, లేదంటే ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీకి అర్థమే ఉండదని రైతులు పేర్కొంటున్నారు.
ఈ ఫొటోలోని రైతుపేరు గోవిందు. ధన్వాడ మండ లం మందిపల్లి స్వగ్రామం. రెండెకరాల 30గుంటల పొ లం ఉంది. ధన్వాడ యూనియన్ బ్యాంక్‌లో గత ఏడాది జూలై 17న లక్షా 30వేలు పంటరుణం తీసుకున్నాడు. రుణమాఫీ రెండో విడుతలో మాఫీ కావాలి. కానీ వి చిత్రం ఏమిటంటే ఈ రైతుకు మొదటి విడుతలో రూ. 30,739 మాఫీ అయినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. మిగతా రూ.లక్షా6,700 కట్టి లోన్ రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని రైతు గోవిందు మరికల్లో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి, రెండో విడుతలోనే మొత్తం రుణం మాఫీ కావాలి. కానీ మొదటి వి డుతలో రూ.30,739 మాఫీ కావడం ఏమిటని, రూ. 1,06,700 చెల్లించాలని బ్యాంకు అధికారులు అడగటం ఏమిటని రైతు గోవిందు ప్రశ్నిస్తున్నాడు.
– మరికల్, ఆగస్టు 1