నాగర్కర్నూల్/కొల్లాపూర్, ఫిబ్రవరి 16 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అర్హులకు మాత్రమే రావాలని సాగుయేతర భూములకు అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు గతనెలాఖరులో టార్గెట్ పెట్టడంతో రైతులు అవస్థలు పడ్డారు. రైతుల సంగతి అటు ఉం చితే రైతు భరోసా భారం తగ్గించుకునేందుకు వ్య వసాయాధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రైతుభరోసా డబ్బులు ఎకరాలోపు రైతులందరికీ పడినట్లు ప్రభుత్వం చెబుతున్నా చాలామంది డబ్బులు ఎప్పుడు వస్తాయని ఫోన్ దగ్గర పెట్టుకొని టకీటకీ మెసేజీల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభు త్వం మాత్రం రైతులను గందరగోళంలో పెట్టి అస లు విషయాన్ని దాచిపెడుతున్నది. రైతులకు నిజాన్ని నిర్భయంగా వెల్లడించేందుకు నమస్తే తెలంగాణ సాగుయోగ్యం కానీ భూముల సర్వేపై ఆరా తీసింది.
రైతు భరోసా షాక్
రేవంత్రెడ్డి సర్కార్ ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు రైతులను మభ్యపెడుతున్నది. రైతులు మాత్రం రైతుభరోసా డబ్బుల కోసం సెల్ ఫోన్లను దగ్గర పెట్టుకొని అంతా భ్రాంతియేనా అంటూ ని ట్టూర్పుగా ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలు లేకుండా రైతుభరోసా భారం నుంచి త ప్పించుకునేందుకు సాగుకు యోగ్యం కానీ భూము ల సర్వేను తెరపైకి తెచ్చింది. సాగుయోగ్యం కానీ భూ ముల సర్వేపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి సర్వే ఆధారంగా రైతుభరోసా ఇచ్చేందకు ప్రభుత్వం సిద్ధమైం ది. అయితే సర్వేలో అధికార పార్టీ నాయకుల పెత్త నం అధికారులపై ఉండడంతో చాలావరకు అధికార పార్టీ నాయకుల సాగుకు యోగ్యం కానీ భూముల వివరాలు రికార్డుల్లో చేరలేదు. కాని విపక్ష పార్టీ నాయకులు, పేద రైతుల సాగుయోగ్యం కాని భూ ముల వివరాలు పక్కాగా రికార్డుల్లోకి ఎక్కాయి.
సాగుపై ప్రభావం
నాగర్ర్నూల్ జిల్లా వ్యాప్తంగా 7,45,684.1 క్లియర్ ల్యాండ్ ఉంటే శుక్రవారం నాటికి 7771.91 ఎకరాలను వ్యవసాయేతర భూములుగా గుర్తించి రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 7771.91 ఎకరాలకు రైతుభరోసా రాదు. గోదాములు, కోళ్ల ఫారం, ఇతర కమర్షియల్ భూములు మినహాయించి మిగిలిన భూములు మళ్లీ సాగులోకి తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది. సర్వేలో గుర్తించిన భూములను అధికారులు అధికారికంగా రికార్డుల్లో నమోదు కూడా చేశారు. ఒకవేళ సాగులోకి వచ్చిన భూమికి రైతుభరోసా వచ్చేందుకు ముందు రికార్డుల్లో వ్యవసాయేతర భూముల జాబితా నుంచి తొలగించాలి.. కానీ ప్రస్తుతానికి ఆ సౌకర్యం లేదని తెలుస్తోంది.
దిక్కుతోచని స్థితిలో వ్యవసాయాధికారులు
రాష్ట్రంలో వ్యవసాయ అధికారుల పరిస్థితి ముం దు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. వ్యవసాయేతర భూముల సర్వేపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవు. సర్వేలో గందరగోళ పరిస్థితిపై సందేహాలపై రైతులు అడిగే ప్రశ్నలకు వ్యవసాయ అధికారుల వద్ద సమాధానాలు లేవు. ఉదాహరణకు ఒక సర్వే నెంబరులో ఐదెకరాల భూమి ఉంటే అందులో 20 గుంటలు వ్యవసాయేతర భూమిని మాత్రమే రికార్డుల్లోకి ఎక్కించే ఆప్షన్ లేదు. నిషేధిత జాబితాలోకి ఎక్కించాలంటే సర్వే నెంబరులోని భూమి మొ త్తాన్ని ఎక్కించాలి. లేదంటే పూర్తిగా వదిలేయాలి. ఇలాంటి పరిస్థితిలో రైతుభరోసా డబ్బులు పడని రైతులు తమ కార్యాలయాలపై దండయాత్ర చేస్తున్నారని వ్యవసాయాధికారులు భయపడుతున్నా రు. ఇటీవల కొల్లాపూర్ మండలంలోని చింతలపల్లి కి చెందిన ఓ రైతు వ్యవసాయ అధికారి కార్యాలయానికి వచ్చి ఏవోను బెదరించి వెళ్లాడు. ప్రభుత్వం చేసి న తప్పిదానికి అధికారులు బలవుతున్నారు.
కల్లాలు, దొడ్లు వ్యవసాయేతర జాబితాలోకి..
వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే కల్లా లు, దొడ్లు కూడా రైతుల అనుమతి లేకుండానే నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ప్రతిరైతు గ్రామంలో పుశువుల కోసం వాటి మేతకోసం కల్లాలు, దొడ్లను ఏర్పాటు చేసుకొని అనాదిగా వాడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నారు. అంతేకాదు పొలాల్లో గుంట, రెండు గుంట ల్లో నట్లు (రాయి) ఉంటే వాటిని తీయించే ఆర్థికస్థోమత లేకపోవడంతో అలాగే వదలిపెట్టారు. గతంలో కేసీఆర్ సమయంలో వచ్చిన రైతుబంధు డబ్బులతో నట్లను తీయించుకునేవారు ఇప్పుడు వాటిని జమా ఖర్చు ల్లో రైతుభరోసా నుంచి తప్పించారు. ఇప్పుడు సొం త డబ్బుతో పొలాల్లో పాట్లను తీసివేసి సాగులోకి తెచ్చుకున్న రైతుభరోసా డబ్బులు పడే అవకాశం లేకుండా ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది.
రైతు వ్యతిరేక ప్రభుత్వం
వ్యవసాయేతర భూముల పేరుతో కల్లాలు, దొడ్ల కు రైతు పొలాల్లో ఉండే నట్లకు రైతు భరోసా చెల్లించకుండా రైతుల ను వ్యవసాయం నుంచి దూరం చేసేందుకు కుట్ర చేసింది. ఇచ్చే రైతుభరోసా కూడా కొంత మందికి మాత్రమే ఇచ్చి చేతులను దూలుపుకున్నది. ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వంతో పాటు రైతువ్యతిరేక ప్రభుత్వం.
– దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
రైతును ఇబ్బంది పెట్టొద్దు
అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతుభరోసా ఇవ్వాలి. రైతుభ రోసాలో మినహాంపుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. రైతులు సాగులోకి తెచ్చుకున్న భూములను నిషేధిత జాబితా నుంచి ఎప్పుడు తొలగిస్తారనేది కూడా అధికారుల వద్ద స్పష్టత లేదు. దీని వల్ల రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలి
– బాలపీరు, రైతు సంఘం మండల కార్యదర్శి
రైతులకు అన్యాయం
నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రాళ్లు ఉన్నాయి. వానకాలం పంట సాగు చేశా. ఇప్పుడు వ్యవసాయానికి పనికి రాదని రైతు భరోసా రాదని చెబుతున్నారు. ప్రభుత్వం ముందు వ్యవసాయం కింద పెట్టుబడి సాయం అందిస్తే సాగులోకి తెచ్చుకుంటాం. నిషేధిత జాబితాలో వేస్తే నేను సాగులోకి తె చ్చుకున్న తర్వాత నిషేధిత జాబితా నుంచి తొల గిం చేందుకు అవకాశం లేదు.
– నిరంజన్, రైతు