వీపనగండ్ల, మా ర్చి 29 : నాటుబాంబులు పేలిన ఘటనలో ఓ వ్యక్తి చేతికి తీవ్ర గాయాలైన ఘటన వీపనగండ్ల మండలంలో కలకలం రేపుతున్నది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గోవర్ధనగిరి గ్రామంలో ఊర చెరువు అలు గు సమీపంలో గ్రామానికి చెందిన మే కల శేఖర్ అనే వ్యక్తి పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే చెట్టుపై కవర్లో ఉన్న బాంబులను తీసి బండరాయిపై వేయగా ఒక్కసారిగా పేలడంతో చేతికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.
బాధితుడిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించగా మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. బాంబుల కలకలం ప్రచారం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పందుల కోసం గ్రామస్తులే బాంబుల ను పెట్టారా, లేక వేరే కారణంగా బాంబులను పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఈ ఘటనలో నాలుగు నాటు బాంబులు గుర్తించగా పోలీసులకు తెలియకుండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెరువు నీటిలో వేసినట్లు సమాచారం. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.